Begin typing your search above and press return to search.

ఉగాదికి నో అప్డేట్.. ఫ్యాన్స్ అప్సెట్..!

By:  Tupaki Desk   |   20 March 2023 9:00 PM GMT
ఉగాదికి నో అప్డేట్.. ఫ్యాన్స్ అప్సెట్..!
X
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో త్రివిక్రం చేస్తున్న హ్యాట్రిక్ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. సినిమాలో పూజా హెగ్దే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా ఉగాదికి సినిమా నుంచి టీజర్ వస్తుందని వార్తలు వచ్చాయి. ఉగాదికి మహేష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ పక్కా అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఉగాదికి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదట.

సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ తో అదరగొడతాడని తెలుస్తుంది. మహేష్ సినిమాల్లో ఈ మూవీ ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. అయితే సినిమా నుంచి ఉగాదికి టైటిల్ పోస్టర్ కానీ టీజర్ కానీ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదు.

జోరుగా షూటింగ్ కొనసాగుతుండగా ఈ టైం లో టీజర్ కోసం టైం వేస్ట్ అవుతుందని భావించి సినిమా టీజర్ ఉగాదికి మిస్ చేసి నెక్స్ట్ పండుగకి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిత్ర యూనిట్. సినిమా షూటింగ్ పూర్తవడం ముఖ్యం కానీ టీజర్ కాదని మేకర్స్ ఆలోచన.

అయితే సినిమాకు ప్రమోషన్ అనేది టీజర్ నుంచే మొదలవుతుంది. ఈ క్రమంలో ఉగాదికి సినిమా టీజర్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు నిర్మాతలు. మహేష్ 28వ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది.

అల వైకుంఠపురములో సూపర్ హిట్ తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. మహేష్ ఫస్ట్ టైం తన సినిమాను నేషనల్ వైజ్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక సినిమాను ఆగష్టు 11న రిలీజ్ అని అంటుండగా అది కూడా వాయిదా పడే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మ్యూజిక్ పరంగా కూడా సూపర్ హిట్ గా నిలిచేలా చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.