ఆర్‌సీ15 వెయిట్ ను మరీ పెంచేస్తున్న మేకర్స్

Mon Jan 23 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

No Update on RC15 Movie Release

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిని మించి క్రేజ్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో భారీ స్టార్ కాస్టింగ్ చూడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఆర్‌సీ 15 చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతుంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మరో చరణ్ పాత్రకు గాను జోడీగా అంజలి కనిపించబోతుంది. ఇంకా ఈ సినిమాలో ఎస్ జే సూర్య.. జయరామ్.. సునీల్.. శ్రీకాంత్.. నవీన్ చంద్ర.. నాజర్.. సముద్రఖని లు కూడా కనిపించబోతున్నారు.

ఇంత మంది స్టార్స్ ఉన్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను కీలక పాత్రలో నటింపజేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయట. అందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తుంది.

సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాల్లో చరణ్ పాత్రకు గురువు పాత్ర ఉంటుందట. ఆ పాత్రకు గాను ఉపేంద్ర అయితే బాగుంటుందని భావిస్తున్నారట.

ఇప్పటికే దిల్ రాజు టీమ్ ఉపేంద్ర ను సంప్రదించారని తెలుస్తోంది. తెలుగు తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఉపేంద్రకు మంచి క్రేజ్ ఉంది. కనుక ఆయన క్రేజ్ సినిమాకు కూడా ఉపయోగపడటం ఖాయం అన్నట్లుగా మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. మరి ఉపేంద్ర ఓకే చెప్పాడా.. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొత్త ప్రచారం ఇటీవల ప్రారంభం అయ్యింది. విడుదల తేదీ విషయంలో మళ్లీ అధికారికంగా దిల్ రాజు కాంపౌండ్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.    నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.