గడువు ముగిసినా ఎన్నికలు లేవు ఎందుకని?

Sat Sep 24 2022 16:22:00 GMT+0530 (India Standard Time)

No Update on Film Producers Elections

టాలీవుడ్ లో ఎన్నికలు అంటే ప్రతీ ఒక్కరికీ టక్కున గుర్తొచ్చేది 'మా' ఎన్నికలే. ఈ ఎన్నికల సందర్భంగా జరిగే హంగామా. ఆర్టిస్ట్ ల మధ్య సాగే వాడీ వేడీ చర్చలు విమర్శలు హాట్ టాపిక్ గా మారి సాధారణ ఎన్నికలని మించిన వేడిని రగిలిస్తుంటాయి. ఇది గంత కొంత కాలంగా ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి టాలీవుడ్ లో జరుగుతూనే వుంది. అయితే ఇప్పడు చెబుతున్నది 'మా' ఎన్నికల గురించి కాదు.. నిర్మాతల మండలి ఎన్నికల గురించి.దీనిపై ప్రస్తుతం సభ్యులు ఆందోళనకు దిగడం రసవత్తరంగా మారింది. ఇటీవల టాలీవుడ్ నిర్మాతల మధ్య షూటింగ్ ల బంద్ విషయంలో తీవ్ర విభేధాలు తలెత్తిన విషయం తెలిసిందే.

యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్ లు బంద్ చేయాలని పిలుపునిస్తూ నిర్మాతల మండలికి చెందిన మేజారిగటీ వర్గాలు నిర్మాతలు అందుకు తీవ్ర వ్యతిరేకతని ప్రదర్శించారు. అనంతరం ఇరు వర్గాల మధ్య జరిగిన చర్యల తరువాత అంతా కలిసి బంద్ కు పిలుపునివ్వడం తెలిసిందే.

ప్రస్తుతం బంద్ ని విరమించుకున్న నిర్మాతలు మళ్లీ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో చాలా వరకు భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్ లు కూడా పట్టాలెక్కేశాయి.

ఇదిలా వుంటే తాజాగా నిర్మాతల మండలికి గడువు ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొంత మంది నిర్మాతలు ఆందోళనకు దిగడం ఆసక్తికరంగా మారింది. శనివారం ఉదయం కొంత మంది నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ లో ప్లా కార్డ్ లు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.

ప్రస్తుత అధ్యక్షుడు సి. కల్యాణ్ నియంతృత్వ పోకడల వల్లే నిర్మాతల మండలిలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలని అడిగినా వాయిదా వేస్తూ సభ్యుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సి. కల్యాణ్ పై మండిపడ్డారు. గత నాలుగేళ్లుగా నిర్మాతల మండలిలో సర్వసభ్య సమావేశాల్ని జరపడం లేదని అంతే కాకుండా సభ్యులకు లెక్కలు చూపించడం లేదని వెంటనే నిర్మాతల మండలికి ఎన్నికలు జరపాలని సభ్యులు డిమాండ్ చేశారు. మరి దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు సి. కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.