Begin typing your search above and press return to search.
ఎక్కడా ఆయన పేరెత్తడం లేదు ఎందుకని?
By: Tupaki Desk | 25 Jan 2023 3:00 PM'RRR' ఫైనల్ గా ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్టాత్మక పురస్కారాల్ని సొంతం చేసుకున్న 'RRR' హాలీవుడ్ దిగ్గజాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని సొంత చేసుకుని చరిత్ర సృష్టించింది. త్వరలో ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తా చాటబోతోంది. 'నాటు నాటు' సాంగ్ కు గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ మూవీని ఫైనల్ గా ఆస్కార్ కు నామినేట్ కావడం తెలిసిందే.
అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచి ఒకరి పేరు మాత్రం వినిపించడం లేదు. అదే చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య. 'బాహుబలి' సమయంలో అంతర్జాతీయంగా ప్రతీ వేదికపైనా రాజమౌళి, ప్రభాస్, రానాలతో పాటు ఈ మూవీ ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిల పేర్లు కూడా వినిపించాయి. ఇందులో ప్రధానంగా శోభు యార్లగడ్డ మాత్రం రాజమౌళి టీమ్ ఎక్కడికి వెళితే వారితో పాటే ఆయన కూడా వెళ్లారు. పలు మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు.
రాజమౌళి ప్రతీ ఈవెంట్ కి శోభు యార్లగడ్డ ని వెంటబెట్టుకు వెళ్లారు. స్వదేశంలో అయినా, విదేశాల్లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లలో అయినా శోభు యార్లగడ్డ కూడా టీమ్ తో వున్నారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.
విదేశాల్లోనూ పలు మీడియా సంస్థలతో ప్రత్యేకంగా ముచ్చటించారు కూడా. అయితే 'RRR' నిర్మాత దానయ్య విషయంలో మొదటి నుంచి చాలా భిన్నంగా జరుగుతోంది. 'RRR' కు దానయ్య నిర్మాత. అంత వరకే అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అంతకు మించి కూడా ఆయన గురించి దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ప్రస్థావించడం లేదు. ఏదో ఇచ్చిన మాట కోసం రాజమౌళి సినిమా చేశాడు అంతే. ఆయనకు అదే ఎక్కువ అనుకున్నారో ఏమో తెలియదు కానీ జరుగుతన్న పరిణామాల్లో ఆయన పేరుని మచ్చుకైనా వాడకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన సందర్భంలోనూ దానయ్య మౌనంగానే వున్నారు.
దానయ్య ఎందుకు సైలెంట్ గా వుంటున్నాడన్నది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. తనకు ఇచ్చిన మాట కోసం రాజమౌళి సినిమా చేశాడు అదే తనకు పదివేలు అనుకున్నాడో లేక తనకు అంతర్జాతీయంగా పబ్లిసిటీ అవసరం లేదనుకున్నాడో ఏమో తెలియదు కానీ దానయ్య మాత్రం 'RRR' విషయంలో ఇప్పటికీ మౌనం వహించడం ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.