సైరా గురించి ఎందుకింత మౌనం

Sun May 19 2019 13:02:59 GMT+0530 (IST)

No Clarity on Chiranjeevi Sye Raa Movie Release Date

ఒకపక్క మెగా ఫ్యాన్స్ సైరా రిలీజ్ అక్టోబర్ 2గా ఫిక్స్ చేసుకుని ఆ మేరకు కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టేసుకున్నారు. చూస్తేనేమో టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని రామ్ చరణ్ రెస్ట్ లో ఉన్నా కూడా దాని గురించి ట్వీట్ పెట్టడం లాంటి కనీస చర్యలు కూడా చేయలేదు. ఒకపక్క షూట్ జరుగుతున్నా రిలీజ్ డేట్ విషయంలో ఎందుకింత మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు.ఇప్పుడు ప్రచారంలో ఉన్న డేట్ కి చాలా సమయం ఉన్నప్పటికీ సైరా లాంటి పాన్ ఇండియా మూవీకి ఒక్కసారిగా బజ్ తీసుకురావడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా నార్త్ తో పాటు తమిళ కేరళ కన్నడ ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని నరసింహారెడ్డిని వాళ్లకు కనెక్ట్ అయ్యేలా చేయాలంటే పబ్లిసిటీ వేగం పెంచాలి. ఒక్కొక్క అడుగు వేస్తున్న తరహాలో పోస్టర్లు కానీ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్ డేట్స్ కానీ వదలాలి

కానీ సైరా యూనిట్ అదేమి చేయడం లేదు. వరస చూస్తుంటే అక్టోబర్ 2కైనా వస్తుందా అనే అనుమానాలు కలగడం సహజం. మేను మినహాయిస్తే కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియో ట్రాక్స్ విడుదల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటా రెండా ప్రమోషన్ మీదే చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. రాజమౌళి బాహుబలికి చేసిన తరహాలో ఖర్చు లేకుండా మీడియా ద్వారానే అగ్రెసివ్ గా ప్రమోట్ అయ్యేలా చేస్తే తప్ప సైరా మీద పెట్టుబడి రూపంలో పెట్టిన రిస్క్ కు రక్షణ ఉండదు. అందుకే వీలైనంత త్వరగా సైరా సందడి మొదలుకావాలని అభిమానులు కోరుతున్నారు. రామ్ చరణ్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చి కాస్త దీని మీద ఫోకస్ పెట్టడం చాలా అవసరం