Begin typing your search above and press return to search.
సందీప్ వంగా 'యానిమల్' అద్భుతాలు చేస్తుందా?
By: Tupaki Desk | 10 Jun 2023 9:00 AMఅర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా హిందీ లోకి రీమేక్ చేసిన తెలుగు యువ దర్శకుడు సందీప్ వంగా అక్కడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేష్ తో ఓ సినిమా కి సన్నాహాలు చేసినా క్రియేటివ్ డిఫరెన్సెస్ తో అది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రణబీర్ తో టీ సిరీస్ సినిమా ని సందీప్ వంగా అధికారికం చేసుకున్నాడు. దీని కి యానిమల్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని నిర్ణయించారు. ఈ చిత్రం లో రష్మిక మందన కథానాయిక గా నటిస్తోంది.
గత కొంతకాలంగా 'యానిమల్' చిత్రం తొలి గా ప్రకటించిన తేదీన కాకుండా వేరే తేదీ లో విడుదల కాబోతోందని పుకార్లు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడలేదని తెలిసింది. ఆగస్టు 11న యథాతథంగా విడుదలవుతుందని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించిన యానిమల్ గ్యాంగ్ స్టర్ వార్ నేపథ్యం లో సాగే యాక్షన్ థ్రిల్లర్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రణబీర్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్ లో క్రూయెల్ గా కనిపించాడు. చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ ని ఇంత వైవిధ్యంతో చూపిస్తున్న తొలి దర్శకుడు తెలుగు వాడైన సందీప్ వంగా కావడం ఆసక్తిని కలిగించింది.
అయితే సందీప్ వంగా సినిమా కు పలువురు అగ్ర కథానాయకుల సినిమాలు పోటీ బరి లో ఉన్నాయని దీంతో యానిమల్ విడుదల ను వాయిదా వేశారని కథనాలొచ్చాయి. సన్నీడియోల్ నటిస్తున్న గదర్ 2 జూలై లేదా ఆగస్టు లో విడుదలవుతుందన్న ప్రచారం సాగింది. యానిమల్ తో గదర్ 2 పోటీపడనుందని కథనాలొచ్చాయి. గదర్ ఘనవిజయం నేపథ్యంలో గదర్ 2పై ఉత్తరాదిన అంచనాలున్నాయి.
ఇందు లోను తారా సింగ్ - సకీ నా కథ ను తిరిగి తెర పై వీక్షించే వీలుందని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రం ప్రీక్వెల్ నుండి అదే స్టార్ కాస్టింగ్ నటిస్తున్నారు. అదే కథ కు కొనసాగింపుగా ఈ సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో సన్నీ డియోల్ -అమీషా పటేల్ తిరిగి తారా- సకీ నా పాత్రల ను పోషించారు. మొదటి భాగం లో వారి కొడుకుగా నటించిన ఉత్కర్ష్ శర్మ కూడా జీతే పాత్ర ను తిరిగి పోషించనున్నారు.
2023లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలవుతున్న యానిమల్ తో రణబీర్ మరోసారి రికార్డులు బ్రేక్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. అంచనాలు మించిన బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత భారీ గా తెరకెక్కిస్తుండడంతో అందరి లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ని భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ ల T-సిరీస్- మురాద్ ఖేతానీ సినీ1 స్టూడియోస్ - ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇది తమిళం- తెలుగు- మలయాళం - కన్నడ సహా ఐదు భాషల లో ఆగస్టు 11 న థియేటర్లలో విడుదల కానుంది. ఇతర సినిమాల పోటీ తో ఎలాంటి సంబంధం లేదని.. చెప్పిన తేదీ కి విడుదల చేస్తామని యానిమల్ చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఇక రణబీర్ తో తెలుగు దర్శకుడు సందీప్ వంగా అద్భుతాల గురించి మాట్లాడుకోవడమే పెండింగ్.