పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు లేనట్లే?

Tue Feb 07 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

No Chance of Pawan Kalyan Films ReRelease

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు చెబితే చాలు రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు వెర్రెత్తిపోతారు. ఆయనను చూసేందుకు తాకేందుకు ఆయన సినిమాలు ఫస్డ్ డే ఫస్ట్ షో చూసేందుకు వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే చివరగా భీమ్లా నాయక్ సినిమాలో కనిపించి మెప్పించిన ఈయన.. ఆ తర్వాత ఏ సినిమాలు చేయలేదు. ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. రెండు పడవలపై ప్రయాణాలు చేస్తూనే సినిమాల్లో హిట్లు కొడుతున్నారు.అయితే ఈయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. పవర్ స్టార్ కు ప్రత్యేక ఫ్యాన్స్ వచ్చేలా చేసిన బద్రీ తొలిప్రేమ సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలను ఇప్పట్లో రీ రిలీజ్ చేయట్లేదని తెలుస్తోంది.

ముందుగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీన బద్రి సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రోజు తొలిప్రేమ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.

కానీ ఈ సినిమాలు ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. మహాశివరాత్రి ప్రేమికుల రోజు ఈ సినిమాలు రీరిలీజ్ కావడం కష్టమేనని... అయ్యే అవకాశమే లేదని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

అయితే తొలిప్రేమ సినిమా డైరెక్టర్ కరుణాకర్ కు తొలి చిత్రం కావడం అలాగే బద్రి కూడా పూరీ జగన్నాథ్ కు మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ రెండు సినిమాలు పవన్ కల్యాణ్ కెరియర్ గ్రాఫ్ ను ఒక్కసారిగా పైకి లేపాయి.

ఇప్పటికీ ఆ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కో ప్రేక్షకుడు అయితే ఇప్పటికి కొన్ని వందల సార్లు ఆ సినిమాలను కూడా చూసినట్లు చెబుతుంటారు. అంతటి క్రేజ్ ఉన్న చిత్రాలు రీరిలీజ్ అవుతాయని అంతా ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోనే.. అవి విడుదల కాకపోవడం నిజంగా బాధాకరమే.   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.