పెళ్లి వార్తలపై నిత్యా మీనన్ వింత రియాక్షన్

Thu Jul 21 2022 14:00:00 GMT+0530 (India Standard Time)

Nitya Menon About her Marriage Rumours

అలా మొదలైంది అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిత్యా మీనన్ అతి త్వరలో మలయాళ నటుడితో ఏడు అడుగులు నడవబోతుంది. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరువైపుల పెద్దల నుండి అంగీకారం లభించింది. దాంతో పెళ్లికి సిద్ధం అయ్యారు అంటూ పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేస్తున్నాయి.సోషల్ మీడియాలో మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా నిత్యా మీనన్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో అంతా నిజమే అనుకొని ఏకంగా శుభాకాంక్షలు తెలియజేయడం తో పాటు.. ఆ మలయాళ హీరో ఎవరై ఉంటారా అంటూ గూగుల్ చేస్తున్నారు. నిత్యా మీనన్ పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనే చర్చ కూడా మొదలు అయ్యింది.

ఈ సమయంలో ఆపండ్రోయ్ అంటూ నిత్యా మీనన్ రియాక్షన్ ఇచ్చింది. నాకు తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారా.. మీడియా నిజానిజాలు తెలుసుకుని కథనాలు ప్రసారం చేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తారా? పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవం. పెళ్లి గురించి ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని నిత్యా మీనన్ క్లారిటీ ఇచ్చేసింది.

నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.. మరి నిత్యా మీనన్ కు ఆ హీరో తో ఎలాంటి వ్యవహారం లేకుంటే ఎందుకు పెళ్లి వరకు పుకార్లు వచ్చాయి అనేది కొందరి అనుమానం. ఆ విషయమై నిత్యా మీనన్ మాత్రం స్పందించలేదు. పెళ్లి వార్తలను కొట్టి పారేసిన ఈ అమ్మడు ప్రస్తుతానికి ప్రేమలో కూడా లేను అన్నట్లుగా పేర్కొంది.

తెలుగు తో పాటు తమిళం.. మలయాళంలో కూడా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న నిత్యా ఇప్పుడు మాత్రం కాస్త డల్ అయ్యింది. అందుకే పెళ్లి వార్తలు వచ్చాయని అంటున్నారు. నిత్యా మీనన్ తెలుగు లో భీమ్లా నాయక్ సినిమా చేసింది. ప్రస్తుతానికి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను ఈమె చేస్తున్నట్లుగా తెలుస్తోంది.