నితిన్ కసిగానే ఉన్నాడన్నమాట!

Fri Mar 31 2023 10:02:44 GMT+0530 (India Standard Time)

Nitin Confident on His Next Movie

యంగ్ హీరో నితిన్ ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్ కథలతోనే సక్సెస్ అందుకున్నాడు. కెరియర్ ఆరంభంలో మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నం చేశాడు. అయితే ఊహించిన విధంగా వరుస డిజాస్టర్ లను సొంతం చేసుకున్నారు. తర్వాత ఇష్క్ ఇలాంటి లవ్ స్టోరీ తో మరల హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చారు.పవన్ కళ్యాణ్ తర్వాత కెరియర్ హైయెస్ట్ ఫెయిల్యూర్స్ ఉన్న హీరోగా నితిన్ ఉన్నాడని చెప్పాలి. అయిన కూడా ఈ యంగ్ హీరో ఇమేజ్ కి ఎలాంటి డోకా లేదు. నితిన్ కెరియర్ లో ఒక సక్సెస్ వస్తే రెండు ఫ్లాప్ సినిమాలు రావడం ఆనవాయితీగా మారిపోయింది. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నితిన్ ఖాతాలో రెండు డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఈ సినిమా కంప్లీట్ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ఉండబోతుంది అని సమాచారం. మూవీ కోసం మొదటిసారిగా నితిన్ గడ్డం పెంచేసి రఫ్ లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. లై సినిమా కోసం నితిన్ గడ్డం పెంచిన కూడా అందులో స్టైలిష్ క్యారెక్టర్ ని చేశాడు. అయితే ఒక్కంత వంశీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మాత్రం కంప్లీట్ గా రఫ్ కల్ట్ బేస్ లో ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది.

రంగస్థలం పుష్ప తాజాగా దసరా సినిమాలతో ఇలాంటి కల్ట్ బేస్డ్ క్యారెక్టర్లకు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో నితిన్ కూడా అదే దారిలో వెళ్తూ  మూవీ చేయబోతూ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే మార్చి 30 నితిన్ బర్త్ డే కావడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా ఈ యంగ్ హీరో అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ చెప్పారు.

ఈ సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ చెప్పాలని కోరుకున్నారు. చాలామంది ఫ్యాన్స్ నితిన్ కి ట్యాగ్ చేస్తూ విషెస్ చెప్పడంతో పాటు నువ్వు అప్డేట్ పై క్లారిటీ ఇవ్వాలని అడిగారు.

 ఫైనల్ గా నితిన్ ఒక అభిమానికి రెస్పాండ్ అయ్యారు. బర్త్ డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ లేకపోవడం డిసప్పాయింట్ అయినట్లుగా అభిమాని పేర్కొన్నాడు. దీనిపై నితిన్ రియాక్ట్ అవుతూ ప్రస్తుతం చేయబోయే సినిమా మీ అందరికి గుర్తుండిపోయేలా మీ అందరికీ తెగ నచ్చేలా చేస్తా తమ్ముడు అని రిప్లై ఇచ్చాడు. దీనిని బట్టి నితిన్ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనే మాట వినిపిస్తుంది. అలాగే ఈసారి వక్కంతం వంశీ మూవీ ద్వారా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నట్లుగా తెలుస్తుంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.