3 మిలియన్ స్ట్రాంగ్ అంటున్న నితిన్...!

Thu Jul 16 2020 22:00:04 GMT+0530 (IST)

Nitin says 3 million strong ...!

టాలీవుడ్ యువ హీరో నితిన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 'జయం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నితిన్ ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'దిల్' సినిమాతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయాడు. 'సై' 'ఇష్క్' 'గుండెజారి గల్లంతయ్యిందే' 'హార్ట్ అటాక్' 'అ ఆ' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు. హిట్ ప్లాపులను పట్టించుకోకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో నితిన్ సోషల్ మీడియాలో అరుదైన రికార్డ్ సాధించాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నితిన్ ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్నాడు.ఈ సందర్భంగా నితిన్ ట్వీట్ చేస్తూ.. ''3 మిలియన్ స్ట్రాంగ్! ఫీలింగ్ సో బ్లెస్సెడ్! నా ప్రయాణంలో భాగమైనందుకు.. నాపై ఇంతగా ప్రేమను చూపించినందుకు నా అమేజింగ్ ఫాలోవర్స్ అందరికీ ఒక బిగ్ థ్యాంక్స్!!'' అని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్ లో నితిన్ ని అనుసరించేవారి సంఖ్య 30 లక్షలు దాటడంతో సోషల్ మీడియా వేదికగా నితిన్ అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసారు. నితిన్ కి ఇంత మంది పాలోవర్స్ ఉండటానికి కారణం ఆయన సినిమాలు హిందీలో కూడా డబ్ అవడమే అని ఫ్యాన్స్ అంటున్నారు. నితిన్ నటించిన 'అ ఆ' 'చల్ మోహన్ రంగ' 'శ్రీనివాస కళ్యాణం' హిందీ డబ్ వెర్షన్ కు మిలియన్ల కొలదీ వ్యూస్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో నార్త్ లో కూడా నితిన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో ‘భీష్మ’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న నితిన్ వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాకుండా డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి తో ఓ సినిమా మరియు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' రీమేక్ సినిమా చేయనున్నాడు. వీటితో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమాలో నటించనున్నాడు.