Begin typing your search above and press return to search.

భీష్మ లుక్: ర‌ష్మిక‌తో ఘాటైన ప్రేమ ఘ‌ట‌న‌

By:  Tupaki Desk   |   28 Jan 2020 11:51 AM GMT
భీష్మ లుక్: ర‌ష్మిక‌తో ఘాటైన ప్రేమ ఘ‌ట‌న‌
X
నితిన్ - ర‌ష్మిక మ‌ధ్య ఏం జ‌రుగుతోంది? అస‌లే యూత్ స్టార్ మాంచి దూకుడు మీద ఉన్నాడు. భీష్మ అస‌లే సింగిల్.. అందుకే అమ్మాయి వెంట ప‌డ‌డం .. టీజ్ చేయ‌డం.. గులాబీలు అందించ‌డం.. ఇదంతా చూస్తుంటే బ్యాచిల‌ర్ కాబ‌ట్టి చాలా క‌సిగా ఉన్నాడ‌ని అర్థం చేసుకున్నారు. నితిన్ యాక్టివిటీస్ కి ఏమాత్రం అడ్డు చెప్ప‌క ర‌ష్మిక అంతే ఇదిగా క‌వ్విస్తున్న పోస్ట‌ర్లు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్ రిలీజైంది. ఈసారి పోస్ట‌ర్ లో నితిన్ - ర‌ష్మిక జంట రొమాన్స్ పీక్స్ కి చేరుకుంద‌ని అర్థ‌మవుతోంది. భీష్క క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూస్తూ ర‌ష్మిక సంథింగ్ హాట్ గా క‌నిపిస్తోంది. ఆ టోన్డ్ లెగ్స్ పొట్టి మిడ్డీని చూస్తే కుర్ర‌కారు గుండెలు జిల్ మ‌న‌డం ఖాయం. ప‌ర్ఫెక్ట్ రొమాంటిక్ క‌పుల్ అని పొగిడేస్తే త‌ప్పేమీ కాదు.

ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన పోస్ట‌ర్లు.. టీజ‌ర్ ప్ర‌తిదీ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. తాజాగా భీష్మ పాట‌ల ప్ర‌మోష‌న్ మొద‌లైంది. తొలి సింగిల్ వాటే బ్యూటీ.. ఈనెల 31న రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్ట‌ర్ జెట్ స్పీడ్ తో యువ‌త‌రంలో వైర‌ల్ అయిపోతోంది. ఇంత‌కుముందు రిలీజైన సింగిల్స్ ఆంథెమ్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు వాటే బ్యూటీ అంటూ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 21న సినిమా రిలీజ‌య్యే వ‌ర‌కూ వ‌రుస‌గా పాట‌ల ట్రీట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్- ర‌ష్మిక మంద‌న జంట‌గా `ఛలో` ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం భీష్మ‌`. పిడివి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.