ప్రమోషన్స్ ఎక్కడ భీష్మ ?

Wed Oct 09 2019 17:40:22 GMT+0530 (IST)

Nithin On about Bheeshma Movie Promotions

డిసెంబర్ లో ఓ అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో రవి తేజ 'డిస్కో రాజా'సాయి ధరం తేజ్ 'ప్రతి రోజు పండగే'నితిన్ 'భీష్మ' సినిమాలు చెప్పుకోదగినవి. అయితే ఈ సినిమాల విడుదలకి ఇంకా రెండు నెలలే ఉంది. అందుకే రవితేజ తో పాటు సాయి ధరం తేజ్ కూడా ప్రమోషన్స్ మొదలెట్టేసాడు. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ వదిలేసారు. ఇక రవి తేజ ఇంకాస్త ముందుకు వెళ్లి పది రోజుల్లో మొదటి సాంగ్ కూడా విడుదల చేయబోతున్నాడు. దీపావళి కి టీజర్ అనుకుంటున్నారు.ఇదే నెలలో రానున్న దీపావళి కి 'ప్రతి రోజు పండగే' టీజర్ కూడా విడుదలయ్యే చాన్స్ ఉంది. ఆ దిశగా టీం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలను పక్కన పెడితే 'భీష్మ 'మాత్రం ప్రమోషన్స్ లో వీక్ అనిపించుకుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. అప్పుడెప్పుడో షూటింగ్ కి ముందు టైటిల్ పోస్టర్ ఒకటి వదిలారంతే. మళ్ళీ ఇంత వరకూ ఎలాంటి సందడి లేదు.

నిజానికి క్రిస్మస్ రిలీజ్ అని అనౌన్స్ చేసాక ప్రమోషన్స్ తో 'భీష్మ' ముందుంటాడనుకుంటే బాగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమా మీద దర్శక నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్స్ లైట్ తీసుకుంటున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి 'భీష్మ' ప్రమోషన్స్ లో ఇదే రూట్లో వెళ్తే ఓపినింగ్స్ కూడా కష్టమే.