అ ఆ హీరో.. మొత్తానికి భీష్మకు మోక్షం!

Mon Feb 11 2019 22:47:15 GMT+0530 (IST)

Nithin Bheeshma Movie Launch Date

హీరో నితిన్ తన కెరీర్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడో అన్ని ఫెయిల్యూర్స్ మరే ఇతర హీరోకు కూడా ఎదురై ఉండవు. కానీ ఫెయిల్యూర్లు ఎదురైన ప్రతిసారి ఓ మంచి హిట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతుంటాడు.కొంతకాలం క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' సినిమా నితిన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచి అతడిని హీరోగా మరో మెట్టు పైకెక్కించింది.  ఆ సినిమా విజయం తర్వాత నితిన్ తప్పనిసరిగా నెక్స్ట్ లీగ్ కు చేరతాడని చాలామంది అంచనా వేశారు. కానీ మళ్ళీ వరస పరాజయలతో నితిన్ కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయింది.ముఖ్యంగా 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత నితిన్ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేందుకు చాలా సమయం తీసుకున్నాడు.  'ఛలో' సినిమాతో నాగశౌర్యకు సూపర్ హిట్ అందించిన దర్శాకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  చాలా రోజుల క్రితమే ఈ సినిమా లాంచ్ కావాల్సి ఉన్నప్పటికీ ఆ సినిమాపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ సినిమా అసలు ఉంటుందా లేదా అనే అనుమాలను వ్యక్తమయ్యాయి.  ఈ మధ్య ఒకసారి దర్శకుడు వెంకీ ఈ విషయంపై ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చినా ఈ ప్రాజెక్టుపై అనుమానాలు సమసిపోలేదు.  ఇప్పుడు ఈ ఊహాగానాలకు తెరపడింది.

ఈ సినిమాను ఫిబ్రవరి 25 న లాంచ్ చేస్తున్నారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు నుండి మొదలుపెడతారట. ఈ ఏడాది జులై నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట.  రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.  'భీష్మ' ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తారు. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ 'సింగిల్ ఫరెవర్'.