Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల్లో వీరు వేరయా

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:38 AM GMT
యంగ్ హీరోల్లో వీరు వేరయా
X
యంగ్ హీరోలు ఒక సినిమా చేస్తూ రెండో సినిమా అనౌన్స్ చేస్తుంటే ఓ ఇద్దరు హీరోలు మాత్రం వారి రూటే సెపరేట్ అంటూ ఓ మూడు సినిమాలు అనౌన్స్ చేసి కెరీర్ ను స్పీడప్ చేసుకుంటున్నారు. వారే నితిన్ - నాగ శౌర్య. ప్రస్తుతం 'భీష్మ' సినిమా చేస్తున్న నితిన్ ఇటీవలే వరుస పెట్టి మూడు సినిమాలు అనౌన్స్ చేసాడు. చంద్ర శేఖర్ తో ఓ సినిమా అనౌన్స్ చేసి సెట్స్ పై పెట్టేసిన నితిన్ నెక్స్ట్ వెంకీ అట్లూరి తో 'రంగ్ దే' చేయనున్నాడు. వీటితో పాటు కృష్ణ చైతన్య తో కూడా ఓ సినిమా అనౌన్స్ చేసాడు.

ఇక నాగ శౌర్య కూడా అంతే. ప్రస్తుతం రమణ తేజ అనే డెబ్యూ డైరెక్టర్ తో సొంత బ్యానర్ లో 'అశ్వద్ధామ' చేస్తున్నాడు. అవసరాల డైరెక్షన్ లో 'ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయి' చేయనున్నాడు. 'సుబ్రహ్మణ్యపురం' దర్శకుడు సంతోష్ తో ఒక సినిమా అనౌన్స్ చేసాడు. లేటెస్ట్ గా లక్ష్మీ సౌజన్య అనే లేడీ డైరెక్టర్ తో మరో సినిమా అనౌన్స్ చేసాడు. వచ్చే నెల ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

సో యంగ్ హీరోల్లో నితిన్ - నాగ శౌర్య ఇలా వరుసగా చెరో నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకుంటూ స్పీడ్ పెంచబోతున్నారు. అంటే వచ్చే ఏడాది వీరి నుండి రెండు లేదా మూడు సినిమాలు రిలీస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరూ ఎలాంటి విజయాలు అందుకుంటారో..? లెట్స్ వైట్ సీ.