Begin typing your search above and press return to search.

సైలెంట్ గానే 'నిశ్శబ్దం' ఓటిటిలోకి రానుందా..??

By:  Tupaki Desk   |   14 July 2020 7:10 AM GMT
సైలెంట్ గానే నిశ్శబ్దం ఓటిటిలోకి రానుందా..??
X
ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో కొన్ని నెలల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కన్పించడం లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటిటి లకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి సంస్థలు చిన్న సినిమాలను, మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనుక్కొని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయాలని నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే.

తక్కువ బడ్జెట్ తో రూపొంది నష్టం లేని బేరాలు చిన్న సినిమాలకే సాధ్యం అవుతుంది. ప్రస్తుతం భారీ సినిమాల హక్కులు కొనేందుకు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లు సిద్ధంగా ఉన్నాయట. కానీ ఎందుకో ఇప్పుడు భారీ సినిమాలు కూడా వెనకడుగు వేసినట్లు అన్పిస్తుంది. తాజాగా ఓటిటి విడుదల చిత్రాల జాబితాలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా చేరింది. తెలుగుతో పలు బాషలలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే నేరుగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని నిర్మాతలు కొట్టిపారేశారు. కానీ ఓటిటిలు భారీ సినిమాలకు బయట ప్రచారం నడుస్తున్న విధంగా భారీ ధరలు ఇవ్వడం లేదట.

ఇటీవలే సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఈ సినిమాను థియేటర్‌లోనే ఫస్ట్ విడుదల చేయాలని సలహా ఇచ్చినట్లు డైరెక్టర్ హేమంత్ మధుకర్ తెలిపాడు. అయితే హీరోయిన్ అనుష్క మాత్రం నిర్మాతలకు థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్.. వారికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయిమని చెప్పినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ఓటిటిలలో కూడా సినిమా బాగుంటే ఆదరణ బాగానే లభిస్తుందని నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. మరి అన్నీ కుదిరితే త్వరలోనే డిజిటల్ విడుదల తేదీ ప్రకటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాను కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.