బిబి బోల్డ్ బ్యూటీ కోటి కారు కొనేసింది

Thu Jun 30 2022 08:00:02 GMT+0530 (IST)

Nikki Tamboli Latest photo of her new car

నిక్కీ తంబోలి పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు కానీ తెలుగు ప్రేక్షకులకు చీకటి గదిలో చితక్కొట్టుడు హీరోయిన్ అంటే వెంటనే గుర్తు వచ్చేస్తుంది. ఇక ఉత్తరాది ప్రేక్షకులకు బిగ్ బాస్ నిక్కీ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. సౌత్ మరియు నార్త్ లో మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.హీరోయిన్ గా ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా లేవు. అయినా కూడా ఈ అమ్మడికి ఆదాయం తగ్గలేదు. సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల్లో నటించడం మరియు కమర్సియల్స్ లో నటించడం వల్ల భారీగా సంపాదన దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 14 లో సందడి చేసిన ఈ అమ్మడు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా ఈమె తన కొత్త కారు ఫోటోలను షేర్ చేసింది. దాదాపుగా కోటి రూపాయల విలువ ఉండే బెంజ్ కారును ఈ అమ్మడు కొనుగోలు చేసింది.

తండ్రితో కలిసి బెంజ్ కారు వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ 14 తో వచ్చిన పాపులారిటీ మరియు బోల్డ్ బ్యూటీ అనే ట్యాగ్ తో ఈ అమ్మడు బాగానే సంపాదించిందని తెలుస్తోంది. అందుకే తన డ్రీమ్ కారు అయిన బెంజ్ కారును కొనుగోలు చేసి తండ్రి కి బహుమానం అన్నట్లుగా ఇచ్చిందట.

నిక్కీ కొత్త కారు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీలోని ఆమె స్నేహితులు మరియు సోషల్ మీడియా ద్వారా అభిమానులు కామెంట్స్ రూపంలో అభినందనలు తెలియజేశారు. నిక్కీ  తంబోలి మళ్లీ తెలుగు లో ఒక సినిమా లో నటించబోతుందని.. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.