ఫైనల్ స్టేజ్‌కి చేరిన నిఖిల్ మూవీ

Sat Jan 29 2022 09:00:02 GMT+0530 (IST)

Nikhil movie reaches the final stage

కరోనా కారణంగా చాలా మంది జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అదే తరహాలో సినీ వర్గాల్లోనూ వారి కెరీర్ లోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కోవిడ్ కారణంగా కొంత మంది సినీ కార్మికులకు పని లభించని పరిస్థితి కానీ కొంత మందికి మాత్రం ఎక్సెస్ వర్క్ లభిస్తోంది. మరి కొంత మంది మాత్రం కెరీర్ పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తన నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో నిఖిల్ పెట్టిన పోస్ట్ ప్రాధాన్యతని సంతరించుకుంది. పాండమిక్ కారణంగా కెరీర్ లు ఈ లెవెల్ కి రావడం చాలా దారుణం అని `అర్జున్ సురవరం` రిలీజ్ తరువాత తాను 4 చిత్రాలకు సైన్ చేశానని ప్రస్తుతం రెండు చిత్రీకరణ దశలో వున్నాయని వాటికి సరైన రిలీజ్ డేట్ లు కష్టంగా మారాయని నిఖిల్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే ప్రస్తుతం నిఖిల్ గీతా ఆర్ట్స్ 2 సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న `18 పేజెస్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. రో 10 రోజుల్లో ప్యాచ్ వర్క్ తో సహా చిత్రీకరణ మొత్తం పూర్తి కాబోతోంది. ఈ షెడ్యూల్ లో మేజర్ వర్క్ ని పూర్తి చేసి సినిమాని రిలీజ్ కి రెడీ చేయబోతున్నారు.

ఈ మూవీ తరువాత చందూ మొండేటి డైరెక్షన్ లో అభిషేక్ అగర్వాల్ టీజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న `కార్తికేయ` సీక్వెల్ `కార్తికేయ -2` చిత్రీకరణలో నిఖిల్ పాల్గొనబోతున్నాడు. ఇందులో కలర్స్ స్వాతి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇదే చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

ఇక అనుపమ పరమేశ్వరన్ ఇందులో దేవసేనగా కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ ని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని నిఖిల్ భావిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తరువాతే అంగీకరించిన మరో రెండు చిత్రాలని సెట్స్ పైకి తీసుకురానున్నాడట.