నిఖిల్ మరో పీరియాడిక్ పాన్ ఇండియా

Fri Mar 17 2023 09:09:46 GMT+0530 (India Standard Time)

Nikhil is another periodical pan India

కార్తికేయ2 సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకొని నార్త్ బెల్ట్ లో ఏకంగా 25 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ నేపధ్యంలో నిఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతోనే చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా స్పై అనే టైటిల్ తో ఒక సినిమాని నిఖిల్ పూర్తి చేశాడు.పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఇందులో నిఖిల్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఠాగూర్ మధు నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి నిఖిల్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి ఠాగూర్ మధు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

 ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా మూవీ అంటే పీరియాడిక్ జోనర్ కథలతోనే ఎక్కువ వస్తున్నాయి. ఆ జోనర్ ని టచ్ చేస్తేనే యూనివర్శల్ అప్పీల్ ఉంటుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులు కూడా ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా కథలు సిద్ధం చేసి హీరోలని ఒప్పిస్తున్నారు. ఇక వీటికి డిమాండ్ ఉండటంతో నిర్మాతలు కూడా పెట్టుబడి పెట్టడానికి వెనుకాడటం లేదు.

 ఇప్పుడు నిఖిల్ తో ఠాగూర్ మధు నిర్మించే ఈ కొత్త చిత్రం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథాంశంగానే ఉండబోతుంది అని తెలుస్తుంది. పునర్జన్మల నేపధ్యంలో ఈ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కార్తికేయ2 కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని పాన్ ఇండియా రేంజ్ లో అందుకొని టాప్ స్టార్స్ పక్కకి వెళ్లాలని చూస్తున్న నిఖిల్ కి ఈ మూవీ ఆ కోరిక తీరుస్తుందని భావిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.