Begin typing your search above and press return to search.

నిఖిల్ తో పోటీ పడుతున్న కియారా..!

By:  Tupaki Desk   |   7 Jun 2023 6:00 PM GMT
నిఖిల్ తో పోటీ పడుతున్న కియారా..!
X
పాన్ ఇండియా హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ, పాన్ ఇండియా హీరోలు చాలా అరుదు. వారిలో మాత్రం కియారా అద్వాణీ పేరు ముందుగా వినపడుతుంది. ఇటు టాలీవుడ్ లోనూ, ఇటు బాలీవుడ్ లోనూ ఆమెకు చాలా క్రేజ్ ఉంది. మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆమె ఛాన్సులు కూడా రెండు ఇండస్ట్రీల్లోనూ అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది.

ప్రస్తుతం కియారా తెలుగులో రామ్ చరణ్ తో నటిస్తోంది. ఈ మూవీకి గేమ్ ఛేంజర్ అనే పేరు కూడా ఖరారు చేశారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు హిందీలో కార్తీక్ అయాన్ తో కలిసి సత్యప్రేమ్ కీ కథ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు. మూవీ ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వీరిద్దరూ గతంలో భూల్ భూలాయా సినిమాలో నటించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సత్య ప్రేమ్ కీ కథ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడాని రెడీ అయ్యింది. ఈ సినిమా ఈనెలాఖరుకి అంటే జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ మూవీతో ఆమె టాలీవుడ్ హీరో నిఖిల్ తో పోటీపడుతుండటం విశేషం.

నిఖిల్ స్పై మూవీ కూడా జూన్ 29వ తేదీనే విడుదల అవుతుండటం విశేషం. నిఖిల్ కూడా కేవలం టాలీవుడ్ హీరో అని చెప్పలేం. ఆయన కూడా కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కార్తికేయ2 కేవలం నార్త్ జనాలకు బాగా నచ్చింది. అక్కడే రూ..100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఆయన క్రేజ్ పెరిగిపోయింది.

దీంతో నిఖిల్ స్పై సినిమా విషయంలో అక్కడ కూడా క్యూరియాసిటీ పెరిగింది. సినిమా స్టోరీ కూడా ఇంట్రస్టింగ్ గా, సుభాష్ చంద్రబోస్ జీవిత కథకు సంబంధించినది కావడంతో సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్స్ ఒకేసారి థియేటర్స్ ముందుకు వస్తూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.