Begin typing your search above and press return to search.

నిహారిక స్టన్నింగ్ లుక్.. ఫ్రెండ్స్ తో అలా..

By:  Tupaki Desk   |   27 May 2023 7:28 AM GMT
నిహారిక స్టన్నింగ్ లుక్.. ఫ్రెండ్స్ తో అలా..
X
మెగా డాటర్ నిహారిక కొనెదల పెళ్లి తర్వాత నటనకి రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి మరల డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా డెడ్ ఫిక్సల్స్ ప్రమోషన్స్ కోసం నిహారిక మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంది.

ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తోంది. ఇదిలా ఉంటే డెడ్ ఫిక్సల్స్ రిలీజ్ కావడంతో ఇప్పుడు తన డెడ్ ఫిక్సల్స్ లేడీ బ్యాచ్ తో హ్యాపీగా ఇండోనేసియాలో బాలి వెకేషన్ కి చెక్కేసింది. అక్కడ ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబందించిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో నిహారిక కొనెదల షేర్ చేసుకుంది.

ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ ఫ్రాక్ తో నిహారిక నిండుగా అందాలని ఆరబోస్తూ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ప్రకృతి ఆశ్వాదిస్తూ రొమాంటిక్ గా పరవశించిపోయింది. ఇక ఈ వెకేషన్ ట్రిప్ లో వితికషేరు,అంబటి భార్గవి, జాహ్నవి ఉండటం విశేషం. వీరందరితో కలిసి బాలిలోని కొండలు, కోనలు,జలపాతాల అందాలని తనివితీరా ఆశ్వాదించినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నిహారికకి డెడ్ ఫిక్సల్స్ నటిగా, నిర్మాతగా కొత్త ఉత్సాహం ఇచ్చాయని చెప్పొచ్చు.

దీని తర్వాత వెబ్ సిరీస్ ల పై మరింత యాక్టివ్ గా నిహారిక దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బిగ్ స్క్రీన్ పైకి కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి కంటెంట్ బేస్డ్ కథలని ఆవిష్కరించాలని ప్లాన్ చేసుకుంటుంది.

దీనికి ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డాన్స్ రియాలిటీ షోతో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తరువాత నాన్నకూచి అనే వెబ్ సిరీస్ చేసింది.

తర్వాత ఒక మనసు మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ సినిమా ఫీల్ గుడ్ అనిపించుకున్న కమర్షియల్ సక్సెస్ కాలేదు. నెక్స్ట్ హ్యాపీ వెడ్డింగ్ అనే మూవీ చేసింది, అది హిట్ కాలేదు. తరువాత సూర్యకాంతం అనే సినిమాతో హీరోయిన్ గా ట్రై చేసింది.

ఈ మూవీ ఆమెని నిరాశకి గురిచేసింది. దీంతో బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ పాత్రలకి విరామం ఇచ్చింది. అయితే మరల ఇప్పుడు ఫుల్ టైమ్ యాక్టర్ గా మారడానికి సిద్ధమైనట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. సరైన బ్రేక్ కోసం అయితే నిహారిక కొనెదల వెయిట్ చేస్తోంది.