Begin typing your search above and press return to search.

నీహారిక...ఈసారి మైండ్ బ్లోయింగ్

By:  Tupaki Desk   |   2 Jun 2023 2:45 PM GMT
నీహారిక...ఈసారి మైండ్ బ్లోయింగ్
X
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక కొణిదెల.మొదట టీవీలో యాంకరింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. క్యూట్ లవ్ స్టోరీలు, సరదాగా నవ్వుకునే సినిమాలు ఎంచుకుంది. నటిగా ఆమెను అందరూ గుర్తించారు కానీ, ఎందుకో ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిర్మాతగా కొనసాగుతోంది. తర్వత పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ, ఇటీవల ఆమె పర్సనల్ లైఫ్ సరిగా లేదు అనే వార్తలు వినపడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. డెడ్ పిక్సెల్స్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

నిహారిక సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఆ మధ్య కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరమైన ఆమె మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యింది. ఇటీవల తాను ట్రిప్ కి వెళ్లిన ఫోటోలను షేర్ చేసిన ఆమె తాజాగా ఓ క్యూట్ ఫోటో షేర్ చేసింది.

పింక్ టాప్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. హెయిర్ ని కాజువల్ గా టై చేసి, కళ్లకు కళ్లజోడు పెట్టింది. పింక్ కలర్ టాప్, కింద ట్రైండీ వేర్ ప్యాంట్ ధరించింది. నడుము ఎక్స్ పోజ్ చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా, గతంలో ఎన్నడూ లేని విధంగా నిహారిక బోల్డ్ ఫోటోలతో నెటిజన్లకు షాకిస్తోంది. ఇటీవల ఫ్రెండ్స్ లో బాలీ ట్రిప్ కి వెళ్లినప్పుడు ఏకంగా బికినీ ఫోటో షేర్ చేసి షాకిచ్చింది. గతంలో నిహారిక చాలాసార్లు మెడ్రన్ డ్రెస్లులో కనపడింది. కానీ, మరీ ఇలా బికినీలో కనపడలేదు.దీంతో అందరూ కాస్త షాకయ్యారు. కొందరు యూట్యూబర్ లతో కలిసి ఆమె ఈ ట్రిప్ కి వెళ్లడం విశేషం.

ఇక, ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. అందులో గేమ్ తప్ప మరో ప్రపంచం తెలియని అమ్మాయిగా నటించింది. ఈ సిరీస్ లోనూ కాస్త బోల్డ్ పదాలను వాడి అందరినీ షాక్ కి గురి చేసింది. వెబ్ సిరీస్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లోనూ నిహారిక బోల్డ్ గా మారిందనే వార్తలు వినపడుతున్నాయి.

కాగా, నిహారిక ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ మీద పెట్టినట్లు కనపడుతోంది. ఇటీవల ఓ మూవీకి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అయితే, అందులో తాను నటిస్తుందా లేక కేవలం నిర్మాతగా చేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంద.