మెగా ప్రిన్సెస్ ఉన్నట్టుండి ఛమక్కులా

Sat Jan 18 2020 11:39:19 GMT+0530 (IST)

Niharika Konidela In Saree

మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కథానాయికగా కెరీర్ ఆశించినంత వెలగలేకపోయినా.. ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైనా ఫ్యాన్స్ లో గుర్తింపు మాత్రం దక్కించుకుంది. హిట్టు విషయంలో తనకు లక్ ఎంతమాత్రం కలిసి రాలేదు. మెగా బ్రాండ్ ఈ నటవారసురాలికి కొంతవరకే అక్కరకొచ్చింది. ప్రస్తుతం కొంత కాలంగా నిహారిక స్తబ్ధుగా ఉంది. సినిమాలకు కామా పెట్టి.. వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ లోనైనా రాణించాలని మెగా ప్రిన్సెస్ ప్రత్యేకించి దానిపైనే దృష్టి పెట్టింది.ఆ విషయం పక్కనబెడితే మెగా డాటర్ కాబట్టి ఇకపై అయినా ఎక్స్ ఫోజింగ్ కు ఆస్కారం లేదా? ఆ కండీషన్ వల్లనే తనకు అవకాశాలు రాలేదా? అన్న చర్చా ఫ్యాన్స్ లో సాగుతోంది. అయితే దానికి కూడా చెక్ పెట్టేసే దిశగా నిహారిక ఆలోచిస్తోందనడానికి ప్రూఫ్ గా నెమ్మదిగా బెట్టు వీడినట్టే కనిపిస్తోంది. తాజాగా నిహారిక తన సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసిన ఫోటో జోరుగా వైరల్ అవుతోంది.

స్లీవ్ లెస్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ... క్యాజువల్ సారీలో కురులు విరబోసి అదిరిపోయే ఫోజులిచ్చింది. ఊదా రంగు చీర.. బ్లాక్ టాప్ కాంబినేషన్ ఆకట్టుకుంది. ఈ ఫోటో ఎప్పటిది? అంటే... తాజాగా ఓ ఎలక్ట్రానిక్ స్టోర్స్ లక్కీ డ్రా ఈవెంట్ లో ఇలా కనిపించింది.  అక్కడ తన లోని గ్లామర్ యాంగిల్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది. నిధి అగర్వాల్- హెబ్బా పటేల్ లాంటి అందాల భామలతో కలిసి నిహారిక ఈ లక్కీ డ్రా లో పాల్గొని తనదైన అందచందాలతో  ఆకర్షించారు. ఇకపోతే నిహారిక గ్లామర్ ఎలివేషన్ ఫోటోషూట్ చూడగానే అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. సోషల్ మీడియా యుగంలో ఇలా ప్రభావితం కావడం తగదని సెలవిస్తున్నారు. ఇక ఇటీవల సంక్రాంతి సెలబ్రేషన్స్ లో చీరలో ఎంతో ట్రెడిషనల్ గా హుందాగానూ నిహారిక కనిపించిన సంగతి తెలిసిందే.

పక్కనే ఇద్దరు హాట్ బ్యూటీస్ ఉన్నా.. మెగా డాటర్  ఈ ఈవెంట్లో షో స్టాపర్ అయింది. అగ్ర నాయికల నుంచి చిన్నస్థాయి హీరోయిన్ల వరకూ రెస్టారెంట్లు..షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ల  ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. మెగా డాటర్ కు ఆ ఇమేజ్ ఉన్నా అలాంటి  ప్రయత్నాలు చేయడం లేదు. ఇలా రేర్ గా వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నారు.  2020లో నిహారిక నటించే సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దానిపై తనే స్వయంగా వెల్లడించాల్సి ఉంటుంది.