Begin typing your search above and press return to search.

మేగజైన్ కవర్ పేజీ కోసం 'కాబోయే వధువు' స్టన్నింగ్ ఫోజ్...!

By:  Tupaki Desk   |   23 Oct 2020 5:04 PM GMT
మేగజైన్ కవర్ పేజీ కోసం కాబోయే వధువు స్టన్నింగ్ ఫోజ్...!
X
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల‌ వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఇటీవలే నిహారిక - చైతన్యల నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో జ‌రిగింది. ఈ ఏడాది చివర్లో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయని సమాచారం. మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్న మెగా డాటర్ నిహారిక తాజాగా మేగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ నిర్వహించింది.

కాబోయే వధువు నిహారిక ఈ ఫోటోలలో చాలా అందంగా కనిపించింది. ఎథిక్ దుస్తుల్లో ఉన్న నిహారికకు ఆమె ధరించిన నగలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గతంలో ఫోటోషూట్ కోసం మోడ్రన్ అవుట్ ఫిట్స్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించిన నిహారిక.. ఇప్పుడు మేగజైన్ కవర్ పేజీ కోసం వధువుగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. కాగా, నిహారిక కొన్ని రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్‌ పార్టీ చేసుకున్నారు. మరి మెగా డాటర్ పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక నాగబాబు నిహారిక - చైతన్యల పెళ్లి గురించి ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ డిసెంబర్‌ నెలలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని.. వరుణ్‌ తేజ్‌ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు.