'కాలేజీ టైంలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేసేసా' అంటున్న ఇస్మార్ట్ సిలకా!!

Tue Jul 07 2020 19:00:08 GMT+0530 (IST)

'Dating a boy in college time' says Ismart Silaka !!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. హైదరాబాద్ లో పుట్టిన ఈ గ్లామర్ డాల్ ముంబైలో పెరిగి అక్కడే సెటిల్ అయింది. 'మున్నా మైకెల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన నిధి.. నాగచైతన్య సరసన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే టైగర్ ష్రాఫ్ తో కాలు కదపడంతో అందరి దృష్టి తన వైపు మళ్లింది. మున్నా మైకెల్ సినిమాలో నిధిని చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు అనుకుంది కానీ అవకాశాలు మాత్రం నిధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. ఇండస్ట్రీలోకి ఎన్నో కష్టాలు పడి వచ్చిన నిధి.. బాలీవుడ్ లో అదృష్టం కలిసి రాలేదని.. 'సవ్యసాచి' సినిమాతో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆశలు పెట్టుకున్న సినిమా ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అమ్మడు కాస్త టైం తీసుకొని అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను'లో కన్పించింది. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ఇక గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లో మొదటి హిట్ ను అందుకుంది. ఇక అవకాశాల కోసం గ్లామర్ షో చేయాలని గ్రహించి గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్న ఈ భామ ఇటీవల తన లవ్.. బ్రేకప్.. క్రష్.. గురించిన వివరాలు బయట పెట్టేసింది. చిన్నప్పుడు స్కూల్లో నాలుగవ తరగతి చదివేటప్పుడే.. ఫస్ట్ టైం ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట నిధి. అలా చిన్న వయసులోనే లవ్ అనుభూతి పొందిన అమ్మడు తన ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయిందట. ఆ తర్వాత కాలేజ్ టైంలో మరొక అబ్బాయితో డేటింగ్ కి వెళ్లినట్లు ఒప్పేసుకుంది భామ. ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ ఎప్పటికి మరచిపోలేనని చెబుతోంది. మరి తర్వాత ఏమైందో.. పెద్దగా బయటపెట్టని ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో ఉందా లేదా అనేది క్లారిటి ఇవ్వలేదు. ఇక తన సెలబ్రిటీ క్రష్ గురించి చెప్తూ.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ అంటే పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అమ్మడు గల్లా అశోక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.