Begin typing your search above and press return to search.

అందాల నిధి.. ఏ తోటలోని పండో

By:  Tupaki Desk   |   7 Feb 2023 3:14 PM GMT
అందాల నిధి.. ఏ తోటలోని పండో
X
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్​లో నిధి అగర్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్య సాచి మూవీతో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. అడుగు పెడుతూ పెడుతూనే కుర్ర కారు గుండెల్ని పిండేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్​మీడియాలోనూ ఫుల్​ బిజీగా ఉంటుంది.

బ్యాక్​ టు బ్యాక్​ అదిరిపోయే ఫొటోషూట్లను పోస్ట్ చేస్తుంటుంది. ఎప్పుడూ తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంటుంది. కొత్త కొత్త ఫొటోస్​తో మైమరిపిస్తూ తెగ రెచ్చగొడుతుంది. అవి ఎప్పుడూ నెట్టింట్లో అదిరి పోయే రేంజ్​లో వైరల్ అవుతుంటాయి.

అయితే తాజాగా ఓ గులాబీ కలర్​ డ్రెస్​లో ఎంతో క్యూట్​గా అందంగా ఓ ఫొటోకు పోజు ఇచ్చింది. మీరు నన్ను ప్రేమించిన దాని కన్నా నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఏ తోటలోని పండు ఇది, గార్జియస్​ హెయిర్​, స్టన్నింగ్ నెయిల్స్​, అదిరిపోయే పెదాలు, బ్యూటిఫుల్​, నన్ను నేను మైమరిచిపోతున్నాను అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెగ లైక్స్ కూడా కొడుతున్నారు.

కాగా, నిధి అగర్వాల్​.. హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కర్నాటకకు తరలిపోయింది. ఈ క్రమంలోనే నిధి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.

చైతూ 'సవ్యసాచి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా.. ఈ హీరోయిన్ మాత్రం తన గ్లామర్, యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అలా ఆరంభంలోనే ఫ్లాపులు పలకరించాయి.

వరుసగా ఫ్లాపులు వచ్చినా నిధి అగర్వాల్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్‌కు తొలి హిట్ వచ్చింది. దీని తర్వాత వచ్చిన 'హీరో' పర్వాలేదనిపించింది. ప్రస్తుతం బడా హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. అలా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.