Begin typing your search above and press return to search.

మత్తెక్కించే హొయలతో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   6 May 2021 3:30 AM GMT
మత్తెక్కించే హొయలతో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..!
X
సినీఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ మోడలింగ్ బాటలో వెళ్లి సినిమాల్లోకి వచ్చేవారే ఉంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం అదృష్టం అనేది కాస్త పని చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే.. ఈ రెండు మార్గాలు కాకుండా చైల్డ్ హుడ్ నుండే సినిమాలపై ఆసక్తి ఏర్పడి హీరోయిన్ అయ్యేవారు మరికొందరు. ఈ మూడో మార్గంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నిధి అగర్వాల్. ఈ వయ్యారి చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగి.. మొత్తానికి మున్నా మైకేల్ అనే సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఫస్ట్ మూవీ ఫలితం నిరాశపరచడంతో వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు దృష్టిపెట్టింది. కానీ హీరోయిన్లకి ప్యాషన్ - గ్లామర్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాల్సి వస్తుంది. ఈ వయ్యారి విషయంలో అదృష్టం అనేది ఇంకా యాక్టీవ్ కాలేదని చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటివరకు అమ్మడు చేసిన తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. నిలబడినా నిధికి పెద్దగా పేరు తీసుకురాలేదు. తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో ప్లాప్స్ అందుకున్న నిధి.. పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ అందుకుంది. ఆ సినిమా కమర్షియల్ హిట్ అయినప్పటికీ నిధికి మాత్రం ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. కానీ తమిళంలో మాత్రం నిధికి మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. తమిళంలో హీరో శింబుతో ఈశ్వరన్, జయం రవితో భూమి సినిమాలు చేసింది నిధి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అలాగే అవకాశాలు కూడా తీసుకొచ్చాయట. అయితే నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో నిధికి ఫాలోయింగ్ మాములుగా లేదు. తాజాగా అమ్మడు ఓ సూపర్ గ్లామరస్ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు అందాలన్నీ బయటపెట్టింది. బ్లాక్ డ్రెస్ లో నిధి నిధులను చూస్తూ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం వయ్యారి గ్లామరస్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.