ఫొటోటాక్ : క్యూట్ నిధి క్లీవేజ్ షో

Tue Jul 27 2021 23:00:01 GMT+0530 (IST)

PhotoTalk: Cute? nidhi Cleavage Show

అక్కినేని హీరోలతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ మొదటి రెండు సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయినా కూడా రామ్ తో పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సక్సెస్ దక్కించుకుంది. ఒక్కసారిగా ఈ అమ్మడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఏకంగా పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇది మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా ఈమె సింపుల్ అండ్ స్వీట్ లుక్ తో క్లీవేజ్ షో తో ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఆ ఫొటోను నెట్టింట షేర్ చేసిన నిధికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. నిధి అగర్వాల్ స్కిన్ టోన్ మరియు ఆమె అందం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ అందం చాలా ప్రత్యేకం.. మీరు ఎక్కువ సార్లు మేకప్ లేకుండా కూడా అందంగా కనిపిస్తారు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫొటో కు తక్కువ సమయంలోనే ఏకంగా లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. వేల సంఖ్యలో కామెంట్స్ తో పాటు పెద్ద ఎత్తున షేర్స్ దక్కించుకున్న ఈ ఫొటో లో ఆమె నాచురల్ బ్యూటీగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్ అతి త్వరలోనే ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. మరో వైపు కృష్ణ గారి మనవడు గల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పలు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలతో బిజీ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.