మరీ 4వ క్లాస్ లోనే లవ్ ప్రపోజలా?

Tue Oct 22 2019 23:00:02 GMT+0530 (IST)

మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సెలబ్రెటీ టాక్ షో లో పాల్గొంటున్న స్టార్స్ చాలా బోల్డ్ గా రహస్యాలను అన్ని బయటకు చెప్పేస్తున్నారు. ఇప్పటికే సమంత బెడ్ రూం ముచ్చట్లు చెప్పగా రకుల్.. శృతిహాసన్ లు తమ సీక్రెట్ లు చాలా చెప్పారు. ఇక గత వారం నిఖిల్ తన లవ్ అఫైర్ గురించి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. స్టార్స్ నుండి రహస్యాలు రాబడుతున్న లక్ష్మి మంచు ఈ వారం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను ఇంటర్వ్యూ చేసింది. గత వారాల్లో మాదిరిగా ఈ వారం కూడా మాంచి స్పైసీ కంటెంట్ ను మంచు లక్ష్మి రాబట్టింది.నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ఒకప్పుడు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కాని అతడితో బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నట్లుగా చెప్పింది. ప్రస్తుతానికి ఎవరితో రిలేషన్ లో లేను.. ఇండస్ట్రీలో కూడా ఎవరితో డీప్ రిలేషన్ షిప్ ను కలిగి లేనంది. నా చిన్నతనంలోనే లవ్ ప్రపోజల్ వచ్చింది. నాల్గవ తరగతిలో నాకు లవ్ ప్రపోజ్ చేసిన వ్యక్తితో నేను ఇంకా మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నాను. నాకు షారుఖ్ అంటే పిచ్చి.. నా భర్త రాముడిలా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ నిధి చెప్పుకొచ్చింది.

తన చెల్లెలు హీరోయిన్ గా రావాలనుకుంటుంది. కాని నేను మాత్రం ఆమెను ఇండస్ట్రీలోకి వద్దంటున్నాను. తను బాగా చదువుతుంది. కనుక ఆమె ఇండస్ట్రీలోకి రావడానికి నాకు ఇష్టం లేదంది. నన్ను అభిమానించే ఒక ఫ్యాన్ నాపేరును టాటూ వేయించుకున్నాడు. అతడి అభిమానంను నేను ఎప్పటికి మర్చి పోను అంటూ ఇంకా పలు విషయాల గురించి నిర్మొహమాటంగా రహస్యం లేకుండా మాట్లాడేసింది.