Begin typing your search above and press return to search.

వయసులో చిన్నోడైనా ఆ ప‌నిలో నిక్ గొప్పోడు

By:  Tupaki Desk   |   13 Jan 2021 5:22 AM GMT
వయసులో చిన్నోడైనా ఆ ప‌నిలో నిక్ గొప్పోడు
X
నేచుర‌ల్ వేలో స‌ర‌దాగా మాట్లాడేస్తూనే భ‌ర్త గురించిన సీక్రెట్ మాట్లాడి కెమెరా ముందే దొరికిపోయింది. భ‌ర్త‌తో కాపురం గురించిన ప్ర‌స్థావ‌న వ‌చ్చిన‌ప్పుడు అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా నిక్ పై చేసిన హాట్ కామెంట్ ప్ర‌స్తుతం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ పీసీ ఏమంది? అంటే... ``వయసులో చిన్నోడైనా ఆ ప‌నిలో నిక్ గొప్పోడు. అయినా కాపురానికి వ‌య‌సుతో పనేముంది?`` అంటూ య‌థాలాపంగా మాట్లాడేసింది ప్రియాంక చోప్రా. త‌మ మ‌ధ్య 10 సంవ‌త్స‌రాల అంత‌రం ఉంది క‌దా? అన్న హోస్ట్ ప్ర‌శ్న‌కు పీసీ రా అండ్ ర‌స్టిక్ గా ఆన్స‌ర్ చేయ‌డంతో వీక్ష‌కులు అవాక్క‌య్యారు.

పీసీ అన్న‌ది నిజ‌మే. ప‌బ్లిక్ లోనే నిక్ త‌న భార్య‌ని పెద‌వి ముద్దుల్లో ముంచేసినా.. బెడ్ రూమ్ లో హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగినా అదంతా ఓపెన్ గా ఫోటోల రూపంలో బ‌య‌ట‌ప‌డిపోయింది. అయినా పీసీ ఇప్పుడు దాచేసినా ఏం లాభం? ప‌బ్లిక్ గా ఆ మాట అంటే త‌ప్పు ఎలా అవుతుంది? ఏదో య‌థాలాపంగా అలా నోట్లోంచి వ‌చ్చేసింది అంతే.. దానికి రాద్ధాంతం అవ‌స‌రం లేదు మ‌రి. ఇక వ‌య‌సు అంత‌రం వ‌ల్ల భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చినా ఆ త‌ర్వాత అండ‌ర్ స్టాండింగ్ త‌మ మ‌ధ్య బాగానే కుదురుతుంద‌ని పీసీ వెల్ల‌డించింది. ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం ఓ అమెరిక‌న్ వెబ్ సిరీస్ లో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే ప‌లు హాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. ఇటు బాలీవుడ్ లోనూ నిర్మాత‌గా వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ భారీగా ఆర్జ‌న‌కు ప్లాన్ చేసింది.