హ్యాండ్ బ్యాగ్ కొట్టేశారని లబోదిబోమన్న బ్యూటీ

Thu Oct 29 2020 11:30:29 GMT+0530 (IST)

Nia Sharma bag gets stolen from her car

నా హ్యాండ్ బ్యాగ్ కొట్టేశారు.. దొంగను పట్టుకోండి ప్లీజ్! అంటూ ప్రాధేయపడింది సదరు బుల్లితెర నటి. ఇంతకీ ఎవరా బ్యూటీ? అంటే.. టెలివిజన్ నటి నియా శర్మ తన హ్యాండ్ బ్యాగ్ ను ముంబై నగరంలోని లోయర్ పరేల్ ప్రాంతంలో బుధవారం తన కారు నుంచి దొంగిలించారట.సహాయం కోసం ముంబై పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ తన ట్విట్టర్ లో విషయాన్ని పోస్ట్ చేసింది. "@ ముంబై పోలీస్.. ఎవరో నా కార్ నుండి హ్యాండ్ బ్యాగ్ ను కొట్టేశారు. సేనాపతి బాపట్ మార్గ్ సిగ్నల్..లోవర్ పరేల్ .. సమీపంలో .. ఏదైనా సహాయం కావాలి ప్లీజ్`` అంటూ తన హ్యాండ్ బ్యాగ్ ఫోటోను పంచుకుంది.

ముంబై పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా వెంటనే ఇలా స్పందించింది. ``మేము మిమ్మల్ని అనుసరిస్తున్నాం. మీ నంబర్‌ను ఇన్ బాక్స్ చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. వివరాలు పొందడానికి త్వరలో మిమ్మల్ని పిలుస్తాం`` అని అడిగారు పోలీస్. కొద్దిసేపటికి అంత వేగంగా స్పందించినందుకు థాంక్స్ అంటూ ఆనందం వ్యక్తం చేసింది నియా. తన ట్వీట్ పై స్పందిస్తూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. నియా నటించిన `జమై 2.0` వెబ్ సిరీస్ రెండవ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఆరంభ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో నియాతో పాటు రవి దుబే- అచింత్ కౌర్ నటించారు.