కస్టడీతో చైతూ మాస్ ఇమేజ్ పక్కనా?

Sat Mar 18 2023 09:12:22 GMT+0530 (India Standard Time)

Next to the mass image of Chaitu with custody?

అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకులకి అందించారు. ఇక టీజర్ లో వెంకట్ ప్రభు తనదైన శైలిలోని యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ప్రేక్షకులకి ట్రీట్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో మొదటి సారి నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వెంకట్ ప్రభు లాంటి సక్సెస్ ఫుల్ దర్శకుడితో మూవీ అంటే కచ్చితంగా అంచనాలు గట్టిగానే  ఉంటాయి. వాటిని అందుకునేలానే టీజర్ ఉంది. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అరవింద్ స్వామి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య కెరియర్ లో ఇప్పటి వరకు వచ్చిన సక్సెస్ లు అన్ని కూడా క్లాస్ మూవీస్ ద్వారానే వచ్చాయి. కెరియర్ ఆరంభంలోనే దడ ఆటోనగర్ సూర్య బెజవాడ సవ్యసాచి లాంటి సినిమాలు మాస్ కంటెంట్ తో చేశారు.

అయితే ఈ మూవీస్ అన్ని కూడా అతని కెరియర్ లో డిజాస్టర్ కేటగిరీలో చేరిపోయాయి. బిగ్గెస్ట్ హిట్స్ అన్ని కూడా క్లాస్ కంటెంట్ తో తెరకెక్కినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే మరల  ప్రస్తుతం కస్టడీ మూవీతో మాస్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చైతూ చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక వెంకట్ ప్రభు లాంటి సక్సెస్ ఫుల్ దర్శకుడితో మూవీ కావడంతో అంచనాలు కూడా భారేగానే ఉన్నాయి. మే 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాపైన నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నారు.

చివరిగా చేసిన థాంక్యూ లాల్ సింగ్ చడ్డా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ మూవీతో మళ్ళీ సక్సెస్ కొట్టాలని ప్రయత్నంలో ఉన్నాడు. అదే సమయంలో మాస్ సినిమాలు సెట్ కావంటూ తనపై ఉన్న నెగిటివ్ ఇమేజ్ ని తొలగించుకోవాలని భావిస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా చూసిన కూడా ఈ సినిమాతో చైతన్య హిట్ కొడితే మాత్రం కచ్చితంగా అతని ఇమేజ్ మారిపోతుందని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.