కుర్రహీరోతో దోస్తానా మాత్రమేనా ఇంకేదైనానా?

Thu Dec 03 2020 21:30:46 GMT+0530 (IST)

Is it just a friendship with Hero or something else?

అమ్మాయి- అబ్బాయి స్నేహం చేస్తే దానిని ప్రేమ (డేటింగ్) సాన్నిహిత్యం అని రకరకాలుగా సందేహిస్తారు. అలాంటి సందేహమే ఇప్పుడు ఈ బాలీవుడ్ యంగ్ పెయిర్ పైనా అలుముకుంది. ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందట కదా? అంటూ ఇటీవల గుసగుసలు వేడెక్కించేస్తున్నాయి. ఆమె గోడ దూకి జంప్ అయిపోతే అతడేమో దొరికిపోయాడు! అంటూ మరో పుకార్ హీట్ పెంచేస్తోంది. ఇంతకీ ఈ డేటింగ్ కపుల్ ఎవరై ఉంటారు? అంటే..దోస్తానా 2 పెయిర్ కార్తీక్ ఆర్యన్ - జాన్వి కపూర్ డేటింగ్ పుకార్ల గురించే ఇదంతా. దోస్తానా 2 హాట్ పెయిర్ గా ఆ ఇద్దరికీ యువతరంలో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఏ చిన్న గాలి వార్త వచ్చినా దానిని ఫ్యాన్స్ అంతే ఇదిగా వైరల్ చేసేస్తున్నారు.

జాన్వి - కార్తీక్ మధ్య సాన్నిహిత్యం ఇటీవల సహ నటుల కంటే `ఎక్కువ`గా ఉండవచ్చని తాజా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

బాలీవుడ్లో ప్రస్తుత తరం అత్యంత ప్రతిభావంతులైన తారలలో జాన్వి కపూర్ - కార్తీక్ ఆర్యన్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. రొమాంటిక్-కామెడీ దోస్తానా 2 లో వారు కలిసి ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి ఈ జంట వివిధ సందర్భాల్లో కెమెరా కంటికి చిక్కారు. మంచి స్నేహంతో అభిమానుల హృదయాల్ని గెలుచుకుంటున్నారు.

డ్యాన్స్ క్లాసులు అయినా జిమ్ కి వెళ్లినా లేదా ఇంటర్నెట్ లో స్నేహపూర్వక పరిహాసానికి పాల్పడినా ఆ ఇద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ జోడీ నిజంగా స్నేహితులు మాత్రమేనా లేదా ఇద్దరి మధ్య ఇంకేదైనా రన్ అవుతోందా? అన్న చర్చా మొదలైపోతోంది.

తాజాగా ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. జాన్వి ఇటీవల కార్తీక్ ను తన నివాసంలో సందర్శించారు. కార్తీక్ భవనం నుండి బయలుదేరిన జాన్విని ఫోటోగ్రాఫర్లు వదిలిపెట్టకుండా వెంటాడారుట. ఫోటోగ్రాఫర్ లు బయట వేచి ఉన్నారని జాన్వి - కార్తీక్ ఇద్దరికీ తెలిసిపోవడంతో జాన్వి ఆ సీన్ నుంచి వెనుక ద్వారం గుండా బయటకు వెళ్లిపోయిందట. కెమెరాలకు చిక్కకుండా దాక్కోవాలని ప్రయత్నించిందట. కానీ కార్తీక్ మాత్రం చిక్కాడు.

ఇది ఫ్రెండ్లీ మీటింగేనా? లేక ఇంకేదైనా కోణం ఉందా? అన్న ఆరాలు మొదలయ్యాయి. ఇంకొక ప్రత్యేక కోణం ఏమిటంటే.. ఈ జంట తమ తదుపరి సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రేమలో ఉన్నట్లుగా నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జాన్వి - కార్తీక్ చూపించే గొప్ప కెమిస్ట్రీ మార్కెటింగ్ స్టంట్ కావచ్చు అన్న ప్రచారం మరోవైపు సాగుతోంది.

దోస్తానా 2 అన్నీ బావుంటే 2020 విడుదలకు సిద్ధమైంది. అయితే మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రిలీజ్ ప్లాన్ ని వాయిదా వేయాల్సి వచ్చింది.