Begin typing your search above and press return to search.

'వ్యూస్'కోసం లక్షలు ఖర్చుచేస్తున్న కొత్త సినిమాలు.. పోస్టర్లతో రచ్చ!!

By:  Tupaki Desk   |   11 Jan 2021 11:30 AM GMT
వ్యూస్కోసం లక్షలు ఖర్చుచేస్తున్న కొత్త సినిమాలు.. పోస్టర్లతో రచ్చ!!
X
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మెల్లగా తగ్గుతుండటంతో సినీ ఇండస్ట్రీలో ఆశలు రోజురోజుకి ప్రాణం పోసుకుంటున్నాయి. ఇప్పటికి ఎన్నో విడుదల కావాల్సిన సినిమాలు, షూటింగ్స్ మధ్యలో నిలిచిపోయిన సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా పూజా కార్యక్రమాలతో సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ మధ్య సినిమాలన్నీ సోషల్ మీడియాను నమ్ముకునే విడుదల అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్స్, హోర్డింగ్స్ కనిపించేవి.. ఇప్పుడంతా మారిపోయింది. సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటే చాలు ఇలా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ టైంలో సినీ ప్రేక్షకులంతా టీవీలకు, ఓటిటిలకు అలవాటు పడేసరికి ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ముమ్మరం చేసేసి జనాలకు సోషల్ మీడియాను అలవాటు చేశారు.

అయితే ఈ ఏడాది మెల్లగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్, ప్రీరిలీజ్ వేడుకలు అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే ఈ సంక్రాంతికి చాలా కొత్త సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. వాటి ప్రమోషన్స్ అన్ని కూడా దాదాపు యూట్యూబ్ ద్వారానే అయిపోతున్నాయి. ఎందుకంటే సినిమా మోషన్ పోస్టర్ దగ్గర నుండి టీజర్లు, ట్రైలర్స్, సాంగ్స్ ఇలా అన్ని యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. ఈ మధ్య ఏ టీజర్, ఏ ట్రైలర్ విడుదల చేసినా యూట్యూబ్ లో గంటలలో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అది చిన్న హీరోగాని, పెద్దహీరో గాని వ్యూస్ మాత్రం మిలియన్లలో ఉంటున్నాయి.

మరి ఒక సినిమా ట్రైలర్ ను 24గంటలలో 100మిలియన్ల జనం చూడటమేంటి.. సోషల్ మీడియా మొత్తం మా సినిమా టీజర్ ఇన్ని మిలియన్లు.. అన్ని మిలియన్లు అంటూ పోస్టర్లతో హడావిడి చేస్తున్నారు. ఒక్క సినిమా కాదు విడుదలకు రెడీ అవుతున్న అన్ని అంతే. ఇందులో వాస్తవంగా ఎలాంటి డబ్బులు ఖర్చుపెట్టకుండా పబ్లిసిటీ తెచ్చుకున్న కంటెంట్ వ్యూస్ జీరో అనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సినిమాలకు లక్షలలో ఖర్చు పెట్టి వ్యూస్ కొంటున్నారట. అలాగే తాజాగా ఓ సినిమా 30లక్షల వరకు ఖర్చుపెట్టి మిలియన్ల వ్యూస్ కొనేసిందని.. అలాగే మరో అరడజను సినిమాలు మిలియన్ల వ్యూస్ కోసం దాదాపు 1కోటి రూపాయలు ఖర్చు చేసారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి యూట్యూబ్ వాడిని మేపుతున్నారు అన్నమాట!