సంపూ హీరోగా కొత్త మూవీ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ లో బర్నింగ్ స్టార్!

Sun Feb 28 2021 20:00:01 GMT+0530 (IST)

New movie as Sampu Hero Burning Star in Full Length Entertainer!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కొత్త సినిమా రాబోతోంది. ఇప్పటికే.. 'బజారు రౌడీ' అనే చిత్రంలో నటిస్తున్న సంపూ.. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీ అనౌన్స్ కావడం విశేషం. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన హీరోయిన్ గా వాసంతి నటిస్తోంది. ఆర్.కె. మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధుసూధన క్రియేషన్స్ రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. శ్రీధర్ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ఆదివారం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. మలినేని మాట్లాడుతూ.. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనుందని తెలిపారు. ఇంతవరకూ ఇలాంటి కథలో సంపూర్ణేష్ నటించలేదని ఈ సినిమాలో సంపూ క్యారెక్టర్ కూడా సరికొత్తగా ఉంటుందని చెప్పారు దర్శకుడు.

నిర్మాత ఆశాజ్యోతి గోగినేని మాట్లాడుతూ... ఒక చక్కని కథతో ఈ సినిమా నిర్మిస్తున్నామని చెప్పారు. సంపూర్ణేష్ బాబు హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. మార్చి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు ఆశాజ్యోతి.ఈ మూవీలో సంపూర్ణేష్ బాబు వసంతితోపాటు పోసాని కృష్ణమురళి వైవా హర్ష గెటప్ శ్రీను రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ గోపీకిరణ్ అందిస్తుండగా.. ప్రజ్వల్ సంగీతం సమకూరుస్తున్నారు.