బాబోయ్ అక్టోబర్... మహేష్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్

Thu Mar 23 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

New Tension For MaheshBabu Fans

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఓ రెంజ్ లో ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం SSMB 28 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ గతంలోనే ప్రకటించారు. మహేష్ బాబు బర్త్ డే ఆగస్ట్ 9న కాగా.. ఆగస్ట్ 11న ఈ సినిమా వస్తుండటంతో బ్యాక్ టు బ్యాక్ సెలెబ్రేషన్స్ ఉంటాయని మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరపడిపోయారు.

అయితే ఇప్పుడు భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఇలా రెండు పెద్ద సినిమాలను ఒకే సారి రిలీజ్ చేయడం కాస్త కష్టమే.

ఇక ఇదే కాకుండా సందీప్ వంగా యనిమల్ గదర్ 2 రజినీ జైలర్ ఇలా ఆ వారంలో చాలా పెద్ద పోటీనే ఉందని తెలుస్తోంది. ఇక మహేష్ 28 అక్టోబర్ లో దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు అని తెలుస్తుంది. అయితే మహేష్ మాత్రం అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్నారు. దీనికి ఒక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఖలేజా సినిమా ఇదే అక్టోబర్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

ఇక ఖలేజా కాకుండా అక్టోబర్ లో రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే.. బాబీ అతిథి వంశీ సినిమాలు అదే నెలలో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని మూట కట్టుకున్నాయి.

అందుకే మహేష్ ఫ్యాన్స్ అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్నారని తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకుంటే... ప్రభాస్ ప్రాజెక్ట్ కే రాంచరణ్ 15 సినిమాలు బరిలో నిలిచాయి. ఇక మహేష్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలుస్తుంది. ఇక ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తారో వేచి చూడాల్సిందే.