Begin typing your search above and press return to search.

నా పేరు సీసా.. థ‌ర్డ్ సింగిల్ వ‌చ్చేసింది!

By:  Tupaki Desk   |   30 Jun 2022 10:58 AM GMT
నా పేరు సీసా.. థ‌ర్డ్ సింగిల్ వ‌చ్చేసింది!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం 'రామా రావు ఆన్ డ్యూటీ'. మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ రిలీజ్ పై అనేక ఊహాగానాలు వినిపించాయి. రీ షూట్ లు జ‌రుగుతున్నాయ‌ని, హీరో వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేద‌ని, దీంతో సినిమా రిలీజ్ అనుకున్న స‌మ‌యానికి థియేట‌ర్ల‌లోకి రావ‌డం క‌ష్ట‌మ‌నే వార్త‌లు షికారు చేశాయి.

అయితే ఆ వార్త‌లు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర బృందం ఈ మూవీని జూలై 29న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ మూవీపై వ‌స్తున్న పుకార్ల‌కు తెర‌ప‌డింది. 'జై భీమ్‌' ఫేమ్ ర‌జీషా విజ‌య‌న్‌, దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీ ద్వారా హీరో తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యాన‌ర్ పై .. ఆర్టీ టీమ్ వ‌ర్క్ తో క‌లిసి సుధాక‌ర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు.

సినిమా రిలీజ్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేస్తున్నారు. తాజాగా గురువారం థ‌ర్డ్ లిరిక‌ల్ వీడియోగా చంద్ర బోస్ సాహిత్యం అందించిన 'నా పేరు సీసా..' అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.

ర‌వితేజ, హాట్ లేడీ అన్వేషీ జైన్ ల‌పై పార్టీ సాంగ్ గా చిత్రీక‌రించారు. అన్వేషీ జైన్ సూప‌ర్ హాట్ అందాలు, ర‌వితేజ మాస్ స్టెప్పులతో ఈ పాట థియేట‌ర్ల‌లో మారుమోగేలా వుంది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ పాట‌కు చంద్ర‌బోస్ సాహిత్యం అందించ‌గా శ్రేయాఘోష‌ల్‌, సామ్ సీఎస్ ఆల‌పించారు.

ఫ‌స్ట్ టు సాంగ్స్ ని మెలోడీస్ గా విడుద‌ల చేసిన మేక‌ర్స్ సినిమాలోని కీల‌క ఘ‌ట్టంలో వ‌చ్చే మాసీవ్ సాంగ్ గా 'పా పేరు సీసా' ని తాజాగా విడుద‌ల చేశారు. సామ్ సీఎస్ సంగీతం, స‌త్య‌న్ సూర్య‌న్ ఫొటో గ్ర‌ఫీ ఈ పాట‌కు అద‌ర‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీలో హీరో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

'విక్ర‌మార్కుడు' త‌ర‌హాలో హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ జూలై 29న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌, 'స‌ర్ప‌ట్ట‌' జాన్ విజ‌య్‌, చైత‌న్య‌కృష్ణ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీ‌, మ‌ధు సూధ‌న్ రావు, సురేఖ‌వాణి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.