హీరో వేలెంటైన్స్ డే ఫోటో ట్రెండ్ కాలేదా?

Sat Feb 15 2020 12:10:07 GMT+0530 (IST)

New Name For New Couple

నిఖిల్ త్వరలో  ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే. డాక్టర్ పల్లవి వర్మను ఈ  యంగ్ హీరో పెళ్లాడుతున్నాడు. అయితే ఈ ప్రేమికుల రోజున తన కాబోయే భార్యకు నిఖిల్ ఎలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు? అంటే.. డైరెక్టుగా అమెరికా వెళ్లి తన ఫియాన్సీని కలిసి సర్ ప్రైజ్ ఇచ్చాడట. తనకు ముందే చెప్పకుండా వెళ్లి పల్లవి కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడని తెలుస్తోంది.ఆ తర్వాత ఏమేం చేశారు? అంటే.. నితిన్ -పల్లవి జంట కలిసి డిన్నర్ చేశారు. అలాగే అమెరికాలో జాలీగా షికార్లు చేశారు?  నెక్ట్స్ ఏంటి? అన్నదానిపైనా ఆ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారట. ఏప్రిల్ 16 న ఈ జంట పెళ్లి జరగనుంది. అందుకు ముందస్తు ఏర్పాట్లేమిటో ముచ్చటించుకున్నారు. ఇక తన లేడీ లవ్ తో రొమాంటిక్ మూవ్ మెంట్ కి సంబంధించిన ఫోటోని నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి ``హ్యాపీ వేలెంటైన్స్ డే ఆల్ ఆఫ్ యు.. ఫ్రం యూఎస్! # నిక్ పల్.. `` అంటూ వ్యాఖ్యను జోడించాడు.

అయితే నిన్నంతా ప్రేమ జంటల ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అయ్యాయి. కానీ నిఖిల్ - పల్లవి జంట ఫోటో అంతగా ట్రెండ్ అయినట్టు లేదు. బహుశా ఈ ఫోటోని నిఖిల్ ఆలస్యంగా షేర్ చేయడమే ఒక కారణం కావొచ్చు. మరోవైపు కొలీగ్ స్టార్ నితిన్ తన  ఫియాన్సీ షాలిని కి సంబంధించిన ముచ్చట్లతో నిన్నంతా కాలక్షేపం చేయడంతో అంతర్జాలంలో షాలిని ఫోటోలు జోరుగానే వైరల్ అయ్యాయి. ఇక నిఖిల్ కెరీర్ సంగతులు చూస్తే.. ప్రస్తుతం కార్తికేయ సీక్వెల్ లో నటిస్తున్నాడు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రంతో కలర్స్ స్వాతి తిరిగి రీఎంట్రీ ఇవ్వనుంది. స్వాతి ఓ కీలక పాత్రను పోషించనుందని తెలుస్తోంది. త్వరలోనే సినిమాని లాంఛనంగా ప్రారంభించి అటుపై 40 సెకన్ల నిడివితో ఉండే ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే నిఖిల్ తదుపరి కుమారి 21ఎఫ్ దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ - జీఏ2 సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.