Begin typing your search above and press return to search.

మాస్ రాజా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో... షూటింగ్ షురూ

By:  Tupaki Desk   |   23 March 2023 4:08 PM GMT
మాస్ రాజా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో... షూటింగ్ షురూ
X
మాస్ మహరాజ్ రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. పెళ్లిసందD చిత్రంతో దర్శకురాలుగా పరిచయం అయిన గౌరీ రోణంకి దర్శకత్వంలో మాధవ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు ఆధ్వర్యంలో షూటింగ్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.

రాఘవేంద్రరావు చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రవితేజ గారి సోదరుడు రఘు గారి అబ్బాయి మాధవ్ ను హీరోగా పరిచయం చేయడం హ్యాపీ గా ఉందంటూ నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా గౌరి రోణంకి గత చిత్రం పెళ్లిసందడి మాదిరి కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుందట.

రవితేజ షూటింగ్ లో బిజీగా ఉండి.. ఈ ఓపెనింగ్ కు రాలేక పోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తున్న మాధవ్ ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాం అంటూ చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమా తమ బ్యానర్‌ కి మంచి పేరు తెచ్చి పెట్టడంతో పాటు హీరో మాధవ్‌ కి మంచి చిత్రంగా నిలుస్తుందని అన్నాడు.

దర్శకురాలు మాట్లాడుతూ.. ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారు, సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్.

ఈ చిత్రానికి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందించబోతున్నాడు. ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయిన ఆయన తప్పకుండా చేస్తానంటూ ముందుకు వచ్చాడట.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకు మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడి వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్ అన్నాడు.