తెలుగు ప్రేక్షకులు అంత బకరాలు ఏమీ కాదు బాసూ

Thu Mar 04 2021 16:00:01 GMT+0530 (IST)

Netizens Trolls On Vijay Sethupathi

టాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇతర భాషలకు చెందిన స్టార్స్ సినిమాలకు కూడా పలు సార్లు ఇక్కడ మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా రజినీ.. కమల్.. సూర్యలతో పాటు కొందరు హీరోలను తెలుగు ఆడియన్స్ అభిమానించారు. వారి సినిమాలను ఇక్కడ కూడా హిట్ చేశారు. ఈమద్య కాలంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి అంటే తెలుగు ప్రేక్షకులు చెవులు కోసుకుంటున్నారు. ఆయన ఉప్పెన సినిమా తో మరింతగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఆయన తో సినిమాలకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పాత సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇతర భాషకు చెందిన హీరో ఇక్కడ సక్సెస్ అయితే ఆయన పాత సినిమాలు డబ్ చేయడం చాలా కామన్ గా జరిగే విషయమే. మన భాష హీరోల సినిమాలు కూడా పాతవి వేరే భాషలో ఆ హీరో సక్సెస్ దక్కించుకున్న సందర్బంగా వెళ్తూ ఉంటాయి. కాని అలా వెళ్లిన సినిమాల్లో ఎక్కువ శాతం నిరాశపర్చినవే ఉంటాయి. హిట్ అయిన పాత సినిమాలను విడుదల చేస్తే పర్వాలేదు. కాని ఎలాగూ హీరోకు క్రేజ్ ఉంది.. ఆయన అంటే పడి చస్తూన్నారు కదా అని ప్లాప్ అయిన పాత సినిమాను తీసుకు వస్తే చూడాలని అనుకునేందుకు తెలుగు ప్రేక్షకులు ఏమీ బకరాలు కాదు. విజయ్ సేతుపతి దాదాపు నాలుగు అయిదు ఏళ్ల క్రితం నటించిన ఒక సినిమా ను ఇప్పుడు తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా టైటిల్ తో విడుదల చేయబోతున్నారు.

మెగా డాటర్ నిహారిక ఈ సినిమాలో నటించింది. ఆమె ను పోస్టర్ పై చూపిస్తూ విజయ్ సేతుపతి సినిమా అంటూ ప్రచారం చేసి నాలుగు డబ్బులు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాని అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఈమద్య కాలంలో డబ్బింగ్ సినిమా ఏదైనా వస్తే మొదట దాని ఒరిజినల్ గురించి గూగుల్ లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకున్న తర్వాత చూడాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. కనుక విజయ్ సేతుపతి మూవీ అనగానే బకరాల మాదిరిగా గుడ్డిగా వెళ్లి చూస్తారు అనుకుంటే పొరపాటే. ఇదే పరిస్థితి గతంలో వేరే హీరోలకు జరిగింది. ప్లాప్ సినిమా లను డబ్బింగ్ చేసి థియేటర్ రిలీజ్ చేయడం ఖచ్చితంగా వృథా ప్రయాస అంటూ మీడియా వర్గాల వారు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.