Begin typing your search above and press return to search.

'గని' 'లైగర్' పోస్టర్స్ 'తుఫాన్' రేంజ్ లో లేవంటున్నారే..!

By:  Tupaki Desk   |   18 Jun 2021 10:30 AM GMT
గని లైగర్ పోస్టర్స్ తుఫాన్ రేంజ్ లో లేవంటున్నారే..!
X
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. అందుకే ఆటలోని భావోద్వేగాలను సినిమాగా మలచి.. బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టడానికి ఫిలిం మేకర్స్ రెడీ అవుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అనేక స్పోర్ట్స్ డ్రామాలు తెరకెక్కుతున్నాయి. తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్ 'గని' అనే సినిమా చేస్తున్నాడు.. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి రెండూ హిందీలో ఫర్హాన్ అక్తర్ నటిస్తున్న 'తుఫాన్' పోస్టర్స్ రేంజ్ లో లేవని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో ఫ‌ర్హాన్ అక్త‌ర్ ప్ర‌ధాన హీరోగా రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా 'తుఫాన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక వీధి రౌడీ అనేక పరిణామాల మధ్య ఎలా జాతీయ స్థాయి బాక్సర్‌ కాగలిగాడనేది ఈ చిత్ర కథాంశం. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి ఫర్హాన్ కఠినమైన వర్క్ ఔట్స్ చేసి శరీర ఆకృతిని మార్చుకున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 16న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'తుఫాన్' కు సంబంధించి కొన్ని స్టిల్స్ ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇవి చూసిన కొందరు నెటిజన్స్ 'గని' 'లైగర్' సినిమాలలో వీటికి పోలిక పెడుతున్నారు. రెండు సినిమాలలో ఒక్క పోస్టర్ కూడా 'తుఫాన్' రేంజ్ లో లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు.