హరీశ్ శంకర్ స్పీచ్ పై భిన్నాభిప్రాయాలు

Tue Jan 24 2023 12:00:01 GMT+0530 (India Standard Time)

Netizens Have Different Opinion On Harish Shankar Speech

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్. కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరుంది. మొదటి సినిమా రవితేజతో షాక్ మూవీ తీశాడు.అందులో కథ రవితేజ నటన బాగుందని విమర్శకుల నుండి ప్రశంసలు దక్కినప్పటికీ ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత మళ్లీ రవితేజతోనే తీసిన మిరపకాయ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు హరీశ్ శంకర్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో హరీశ్ శంకర్ కు పెద్ద పేరు వచ్చింది.ఆ తర్వాత అల్లు అర్జున్ తో డీజే వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ సినిమాలు తీసి మోస్తరు హిట్ కొట్టాడు. వరుణ్ తో సినిమా అప్పట్లో ఎప్పుడో 2019లో రిలీజైంది. అప్పటి నుండి హరీశ్ శంకర్ మూవీ ఏదీ పట్టాలెక్కలేదు. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తీస్తున్నాడు. కానీ అదింకా ప్రీ ప్రొడక్షన్ వద్దే ఉంది.

ఈ మధ్యలో ఏ సినిమాలు లేక ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సక్సెస్ మీట్లకు పర్మినెంట్ గెస్టుగా మారిపోయాడని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లోనూ హరీశ్ శంకర్ పాల్గొన్నాడు. అయితే ఈ ఈవెంట్స్ లో మాట్లాడుతూ హరీశ్ శంకర్ అవకాశాల కోసం రిక్వెస్టులు చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లోనూ అదే సీన్ రిపీట్ చేశాడు హరీశ్ శంకర్. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. తనకు అవకాశం వస్తే బాలయ్య బాబును డైరెక్ట్ చేయాలని ఉందని చెప్పాడు.

ఇప్పుడు హరీశ్ శంకర్ చేసిన కామెంట్లపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ ఈవెంట్ కు వెళ్లినా అక్కడ కనిపించిన హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వాలని అడగడం నిర్మాతలను ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసుకోవడంపై ఇటు నెటిజన్లు అటు ఆయన ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబును దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజినీ కాంత్ ను అలాగే విజయ్ దేవరకొండ రామ్ పోతినేనితో కలిసి పని చేయాలనుకుంటున్నానని వ్యాఖ్యలు చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.