`దంగల్` బ్యూటీని బ్యాన్ చేయాలి!

Thu Oct 21 2021 17:08:42 GMT+0530 (IST)

Netizens Fires On Sanya Malhotra

బాలీవుడ్ లో `దంగల్` సినిమాతో ఫేమస్ అయిన బ్యూటీ సాన్యా  మాల్హోత్రా. ఆ ఒక్క హిట్ అమ్మడి కెరీర్ ని ఒక్కసారిగా టర్న్  చేసింది. చిన్నపాటి అవకాశాలతో పాటు టెలివిజన్ షో లతో బిజీ అయింది. ప్రస్తుతం `ససురల్ వండర్ పూల్` అనే రొమాంటిక్ కామెడీ షోలో అషిమా అనే పాత్ర పోషిస్తుంది. అమ్మడి పాత్ర కాస్త రొమాంటిక్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో శృంగారం గురించి మాట్లాడి హాట్ టాపిక్ అయింది. ఇండియాలో శృంగారం అనే పదంపై  నిషేదం ఉంది. ఆ పదాన్ని పెద్ద బూతు పదంగా చూస్తారు. ఇప్పుడిప్పుడే జనాల మైండ్ సెట్లు కూడా మారుతున్నాయి. అందుకు డిజిటల్ మాధ్యమాలు ఎంతో దోహదం చేసాయి.`ససురల్ వండర్ పూల్` వంటి స్టోరీస్ ఆ కోవకు చెందినవే. ఇప్పటికైనా క్రియేటర్స్ ముందుకొస్తున్నారంటే కొంత మార్పు వచ్చింది కాబట్టే. ఇందులో నా పాత్ర శృంగారం అనే పదం వాడలంటే ఇబ్బంది పడే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. అలాంటి ఆమె భర్త.. ఇతర కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లినిక్ నే నడుపుతుంటే? ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి. ఇదే ఈ షో కథ. దీని ద్వారా  కొంత మందినైనా మార్చగల్గుతామని నమ్మకం ఉంది. ఇలాంటి కథల స్ఫూర్తితో కొందరైనా ఇలాంటి విషయాల్లో బహిరంగంగా మాట్లాడుతారని కనీసం చర్చకైనా వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

మొత్తానికి భారత్ లో శృంగారం అనే పదం పెద్ద బూతు అని మరోసారి బూతద్దం పెట్టి చూసేలే ఉన్నారని అమ్మడి వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. ఆ బలహీనతని తన షో ప్రచారం కోసం తెలివిగా  వాడుకుంటున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు సాంకేతికంగా ఎదుగుతుంటే అలాంటి ఎదుగదల గురించి పక్కనబెట్టి ఇలాంటి పనిక మాలిన విషయాలపై సదరు నటి మాట్లాడటం పై స్వరత్రా విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి.  ఇలాంటి వాళ్లను పరిశ్రమలో బ్యాన్ చేయాలంటూ  సోషల్ మీడియా వేదికగా  నెటి జనులు మండిపడుతున్నారు.