ఫోటో స్టోరి: ఎవరమ్మా ఈ చుక్కల్లో చందురూడు? ఓన్లీ విత్ గాళ్స్!!

Sat Apr 01 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Netizens About Orri And Gals Gang

చక్కనోడు.. ఎవరికీ చిక్కనోడు.. చుక్కల్లో చందురూడు.. మన్మథ లీలలతో సంపుతుండు! అతడిని ఎప్పుడు చూసినా ఓన్లీ విత్ బ్యూటిఫుల్ గాళ్స్.. మినిమం స్టార్ కిడ్ రేంజ్. చుక్కల్ని చంద్రుడిలా ఒక్కడిగా  ఏల్తున్నాడు. అతడి చుట్టూ కన్యకలు ''శ్రీకృష్ణుని చుట్టూ గోపికల్లా'' అంత ప్రేమగా రొమాంటిగ్గా కనిపిస్తుంటే.. ఏమిటి ఇతగాడి లీలలు! అంటూ నెటిజనులు కుళ్లుకుంటున్నారు.ఇంతకీ అతడి పేరేమిటీ? అంటే ఒర్రీ అలియాస్ అవ్రతమణి. అలా మగువల మధ్య నవమన్మధుడిలా మెరిసిపోతున్న అతడి విలాసం చూస్తుంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్స్ తో విజయ్ మాల్యా సెలబ్రేషన్ లా ఎంతో యూనిక్ గా కనిపిస్తోంది ఆ సన్నివేశం.

నిండా పాతికైనా నిండని నవతరం నటీమణులకు ఇతడేమైనా బాడీ గార్డా?  లేక ఫ్యాషన్ పోలీసా?   కామన్ స్నేహితుడా లేక చుట్టమా పక్కమా? అంటూ అంతా ఆరాలు తీస్తున్నారు. జాన్వీ కపూర్.. అనన్య పాండే.. సనయ కపూర్ అండ్ గ్యాంగ్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

వీళ్లతో కలిసి ఒర్రీ సెల్ఫీలు దిగుతూ బోలెడంత హంగామా సృష్టిస్తున్నాడు. ఒర్రీ అండ్ గాళ్స్ గ్యాంగ్ రచ్చకు నెటిజనుల్లో రకరకాల కామెంట్లు వచ్చి పడుతున్నాయి.

కొందరు లవ్ ఈమోజీలను ఫైర్ ఈమోజీలను షేర్ చేయడంలో చెలరేగిపోతున్నారు. ''ది కూల్ గ్యాంగ్ ఆఫ్ టిన్సెల్ టౌన్'' అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించగా.. ప్రతి పార్టీ లో కనిపించే ఈ చిచ్చు ఎవరో చెప్పండి ప్లీజ్. కోయి ఆవ్వీన్ లగ్తా హై జో హర్ పిక్ మై ఘుస్ జాతా హై! అంటూ ఒక యువతి (నెటిజన్) ప్రశ్నించింది.

ఆ ముగ్గురు భామల్లో జాన్వీ కపూర్ - అనన్య పాండే ఇప్పటికే కథానాయికలుగా బిజీగా ఉన్నారు. సంజయ్ కపూర్ కుమార్తె సనయ కపూర్ ని కరణ్ జోహార్ కథానాయికగా పరిచయం చేస్తున్నారు. ఈ భామలంతా నెపోటిజం కిడ్స్ జాబితాలో ఉండడంతో నెటిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.