రానా.. శృతిహాసన్ లు కలిశారు

Tue Sep 29 2020 22:38:50 GMT+0530 (IST)

Rana .. Shrutihasan? met

ఇండియాలో ఓటీటీకి ఆధరణ ఒక్కసారిగా పెరిగింది. ప్రేక్షకుల నుండి వస్తున్న ఆధరణ కారణంగా స్టార్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో పాటు స్టార్స్ నటిస్తున్న వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. సినిమాల స్థాయిలో ఓటీటీల కోసం వెబ్ సిరీస్ ల నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ వారు వెబ్ సిరీస్ లను సినిమాలను మించి నిర్మిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ మార్కెట్ ను కలిగి ఉన్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హిందీలో భారీ వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది. ఇదే సమయంలో స్థానిక భాషల్లో కూడా వెబ్ సిరీస్ లకు రెడీ అవుతుంది.తెలుగులో నెట్ ఫ్లిక్స్ రానా మరియు శృతి హాసన్ లతో ఒక భారీ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు తెలుగు ప్రముఖ రచయిత స్క్రిప్ట్ అందిస్తున్నాడు. పది ఎపిసోడ్స్ గా ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అందించే ఉద్దేశ్యంతో ఏకంగా 10 భాషల్లో డబ్ చేయబోతున్నారట. హీరోగా రానా మరియు హీరోయిన్ గా శృతి హాసన్ లు స్టార్ డంను కలిగి ఉన్నారు. వీరిద్దరికి తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లో కూడా గుర్తింపు ఉంది. కనుక ఆ వెబ్ సిరీస్ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.