Begin typing your search above and press return to search.

నేను లోకల్ సీక్వెల్ తీసేంత దమ్ముందా?

By:  Tupaki Desk   |   29 Jan 2023 7:00 PM GMT
నేను లోకల్ సీక్వెల్ తీసేంత దమ్ముందా?
X
నాని కెరియర్ లో వచ్చిన హిట్ మూవీలలో నేను లోకల్ కూడా ఒకటి. పెద్దగా కథ లేకపోయిన కూడా నేచురల్ స్టార్ నాని పెర్ఫార్మెన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కథలో భాగంగా ఉండటంతో ఆరంభంలో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా తరువాత యూత్ కి భాగా కనెక్ట్ అయ్యింది. దీంతో సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. అప్పటికే అలాంటి రొటీన్ కథలని ప్రేక్షకులు చూసిన కూడా నానిని పనిపాట లేకుండా బేవార్స్ గా తిరిగే కుర్రాడి పాత్రలో దర్శకుడు చూపించడం.

ఆ పాత్రలో మనలో ఒకడి తరహాలో నాని పెర్ఫార్మెన్స్ తో మెప్పించడంతో నేను లోకల్ సినిమాకి గ్రాండ్ లుక్ వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఈ మూవీ పట్ల క్రిటిక్స్ పెదవి విరిచారు. ఈ సినిమా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చింది. అలాగే ప్రసన్న కుమార్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో వీరిద్దరి కాంబినేషన్ లో మంచి ఫేమ్ వచ్చింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ తాజాగా మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఏకంగా వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.

రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో కూడా చెప్పుకోవడానికి పెద్దగా కథ లేదు. కాని ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి పెట్టడంతో ఆడియన్స్ ని భాగా కనెక్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మూవీ హిట్ తో జోరు మీద ఉన్న దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరియర్ లో వచ్చిన హిట్ సినిమాలలో నేను లోకల్ మూవీకి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరికి భాగా కనెక్ట్ అయ్యిందని, అందుకే ఛాన్స్ దొరికితే నేను లోకల్ సీక్వెల్ తీస్తానని తన మనసులో మాట బయటబెట్టారు.

అయితే నేను లోకల్ సినిమాలో సీక్వెల్ తీసేంత కథ ఏముంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ సినిమా హిట్ కావడమే పెద్ద లక్ అయితే దానికి ఇప్పుడు సీక్వెల్ అంటే ఎలా ఉంటుందో కదా అని పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా సీక్వెల్ తీసేంత దమ్ము ఒక కథలో ఉంది అనుకుంటే దానిపైన దృష్టిపెట్టవచ్చు. కాని ఒక మామూలు కమర్షియల్ సినిమాకి సీక్వెల్ చేయాలంటే మాత్రం కచ్చితంగా చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పాలి.