Begin typing your search above and press return to search.

నేహా శర్మ బికినీ అందం.. మతి పోగొట్టేసిందిగా..

By:  Tupaki Desk   |   5 Jun 2023 10:00 AM GMT
నేహా శర్మ బికినీ అందం.. మతి పోగొట్టేసిందిగా..
X
నేహా శర్మ అంటే సోషల్ మీడియా ఫాలో అవుతున్న వారిలో తెలియని వారు ఉండరు. అలాగే తెలుగునాట చిరుత హీరోయిన్ అంటే ఈజీగా గుర్తు పడతారు. తెలుగులో ఈ బ్యూటీ రెండు సినిమాలు చేస్తే అందులో మొదటి మూవీ రామ్ చరణ్ డెబ్యూ చిత్రం కావడంతో నేహా శర్మ అందరికి భాగా కనెక్ట్ అయిపొయింది. ఆ తరువాత వరుణ్ సందేశ్ కి జోడీగా కుర్రాడు సినిమాలో నేహా శర్మ కనిపించింది.

ఇక ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ కి పూర్తిగా దూరమైంది. తరువాత హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగిస్తోంది. ఏడాదికి ఒక సినిమాతో అయిన ఈ అమ్మడు ప్రేక్షకులని పలకరిస్తోంది. చివరిగా ఈ బ్యూటీ నవాజుద్దీన్ సిద్దీఖ్ జోడీగా జోగిరా సర రారా అనే సినిమాతో ఈ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

మే 26న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ప్రేక్షకులు ఈ మూవీకి ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే సినిమాల సంగతి పక్కన పెడితే నేహా శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ నేహా శర్మకి ఉండటం విశేషం.

ఈ అమ్మడు రెగ్యులర్ గా పెట్టె హాట్ అండ్ బోల్డ్ ఫోటోలకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏ మాత్రం అందాలని దాచుకోకుండా ఫోటో షూట్ లతో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది. ఈ ఫోటోలని కూడా లక్షల్లో ఫ్యాన్స్ లైక్ చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే అమ్మడు రెగ్యులర్ గా అందాల ప్రదర్శనతో అలరిస్తూ ఉంటుంది.

తాజాగా మరో హాట్ బికినీ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో నేహా శర్మ షేర్ చేసుకుంది. గోవా బీచ్ లో ఇసుక తెన్నెలపై బికినీలో వయ్యారాలు పోతూ ఫోతోకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలో అందాలన్నీ చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. 35 ఏళ్ళ వయస్సులో కూడా వన్నె తగ్గని అందంతో ఈ అమ్మడు హాట్ హాట్ గా కుర్రకారుని నిద్రలేని రాత్రులని నిగిలిస్తుందని ఈ ఫోటోని చూస్తే చెప్పొచ్చు.