Begin typing your search above and press return to search.

వీడియో : చిరుత బ్యూటీ మతులు పోగొట్టే అందం

By:  Tupaki Desk   |   29 Jan 2022 9:43 AM GMT
వీడియో : చిరుత బ్యూటీ మతులు పోగొట్టే అందం
X
రామ్‌ చరణ్ మొదటి సినిమా చిరుత తో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కాని ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. దాంతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కుర్రాడు సినిమా తర్వాత క్రూక్ సినిమా తో 2010 సంవత్సరంలో ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి మళ్లీ తెలుగు లో ఈమె కనిపించలేదు. బాలీవుడ్‌ లో గత పదేళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ముఖ్య పాత్రలు.. హీరోయిన్ గా ఐటెం సాంగ్‌ చేస్తూ ఏదో ఒక విధంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.

ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తుంది. ఓటీటీ కంటెంట్‌ కు మంచి ఆధరణ ఉన్న నేపథ్యంలో జీ 5 కోసం ఒక వెబ్‌ సిరీస్‌ ను ఈమె చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు ఫుల్‌ బిజీగానే ఉంది. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటో షూట్స్ ను ఈమె రెగ్యులర్ గా షేర్‌ చేస్తూనే ఉంది. తాజాగా బీచ్ లో ఉన్న బికినీ ఫొటోలను షేర్‌ చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించింది. ముఖ్యంగా కుర్రకారు మతులు పోగొట్టింది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన వీడియో మరింతగా కుర్రాళ్లను బేజారు చేసేలా ఉంది. అందాల వింధు తో పాటు మతి పోగొట్టే కొంటె చూపులతో ఈ అమ్మడు ఆకట్టుకుంది.

తమిళం మరియు మలయాళం సినిమాల్లో కూడా నటించిన ఈ అమ్మడు మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వాలంటూ అభిమానలు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు లో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సమయంకు ఉన్న పాపులారిటీకి ఇప్పటికి చాలా తేడా ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు ప్రస్తుతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అందుకే తెలుగులో ఇప్పుడు ఈమె నటిస్తే ఖచ్చితంగా మంచి అవకాశాలు రావడం మాత్రమే కాకుండా మంచి సక్సెస్ లు కూడా వస్తాయని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దంన్నర అవ్వబోతున్నా కూడా ఇంకా ఈఅమ్మడి అందాల వింధు ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఈమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడితే బాగుంటుందని అంటున్నారు.