ప్రభాస్ పైనే ఎందుకంత నెగిటివ్ ప్రచారం?

Fri Mar 17 2023 09:20:38 GMT+0530 (India Standard Time)

Negative Trolls on Rebel Star Prabhas

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని సినిమాల ద్వారా సుమారు 3000 కోట్ల మూవీ మార్కెట్ జరుగుతూ ఉంది. దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ఉన్నాడు. అలాగే అతని మూవీస్ పై ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. డిజాస్టర్ అయిన రాదే శ్యామ్ సినిమాకి ఏకంగా 200 కోట్ల వరకు కలెక్షన్ వచ్చింది అంటే ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.అయితే సోషల్ మీడియాలో కొంత మంది నిత్యం అదే పనిగా ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అతని ఫోటోలని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రభాస్ లుక్ మారిపోయింది అంటూ కథనాలు ప్రసారం చేస్తారు. అలాగే ప్రభాస్ అత్యవసర ఆపరేషన్ చేయించుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు లాంటి వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి.

అయితే టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ వైడ్ గా చూసుకున్న అస్సలు తనని తాను సొంతంగా ప్రమోట్ చేసుకోవాలని ఆలోచించని ఏకైన హీరో ప్రభాస్ అని చెప్పాలి.

తనపై వచ్చే నెగిటివ్ ప్రచారాలపై కూడా పెద్దగా రియాక్ట్ కాడు. హీరోయిన్స్ తో అఫైర్స్ అంటూ రూమర్స్ వచ్చిన కూడా లైట్ తీసుకుంటాడు. తప్పుడు ప్రచారాలు చేసే వారు ఎన్ని చేసుకున్న కూడా వాటిపై రియాక్ట్ అయ్యే సందర్భాలు మాత్రం లేవని చెప్పాలి. కృతి సనన్ తో ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపించిన అతను నేరుగా ఎక్కడా రియాక్ట్ కాలేదు.

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలని పూర్తి చేయడం మీదనే ప్రభాస్ దృష్టి ఉంటుంది. ప్రత్యేకంగా పీఆర్ పెట్టుకొని నెగిటివ్ ప్రచారాలపై క్లారిటీ ఇవ్వడం అలాగే సోషల్ మీడియాలో తన బ్రాండ్ ఇమేజ్ ని ప్రమోట్ చేయడం అస్సలు చేయడు.

ఈ కారణంగానే అతనిపై ఎక్కువగా నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నాయనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే ప్రభాస్ విషయంలో ఇలాంటి ప్రచారాలు ఎవరూ నమ్మొద్దు అని అభిమానులు అయితే కోరుతున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.