ఆయిల్ కంపెనీలో నయన్-విఘ్నేష్ పెట్టుబడులు

Sun Jan 16 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Nayanthara to invest 100 crores in Dubai

నయనతార-విఘ్నేష్ శివన్ ప్రేమాయణం సంతోషంగా సాగిపోతుంది.  బ్రేకప్ ల తర్వాత నయన్ లవ్ స్టోరీ విఘ్నేష్ తో సాపీగా సాగిపోతుంది. చాలాకాలంగా ఈ జంట లవ్ లో ఉండటంతో ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకున్నారు. త్వరలో వివాహ బంధంతో ఒకటి కావడానికి రెడీ అవుతున్నారు. ధాంపత్య జీవితంలో ఎలాంటి కలతలు చోటు చేసుకోకుండా  పరిష్కారంగా పూజలు సైతం పూర్తిచేసారు.  ప్రస్తుతం ఇద్దరు ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జంటగా వ్యాపారాలు సైతం చేస్తున్నారు.  ఇటీవలే  సొంతంగా రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అందులో సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు.తొలి ప్రయత్నం సక్సెస్ అయింది. ముందుగా  పరిమిత బడ్జెట్ లోనే సినిమాలు నిర్మించి నెమ్మదిగా ప్రోడక్షన్ పెంచుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లాలని పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈ జంట దుబాయ్ కి చెందిన ఆయిల్ కంపెనీలో ఏకంగా 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ జంట దీనిపై బాగా స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఇదే నిజమైతే ఈ జంట బిజినెస్ పరంగాను బిలీనియర్స్ కావడం ఖాయం. ఆయిలు కంపెనీలో పెట్టుబడులంటే చిన్న విషయం కాదు. లాభదాయకమైన వ్యాపారం ఇది.

ఎంతో మంది బడా  దిగ్గజాలు ఈ రంగంలో సక్సెస్ అయ్యారు.  ఆ కోవలో ఈ జంట సక్సెస్ కావాలని ఆశిద్దాం. ఇక వృత్తి పరంగాను ఈ జంట ఎంతో బిజీగా ఉన్నారు. నయన్ కి సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో  సినిమాకి 5 కోట్లు పారితోషికం  తీసుకుంటుంది. నిర్మాత అవసరాన్ని బట్టి అంతకు మించి ఛార్జ్ చేస్తోంది. అయినా అన్ని భాషలకు న్యాయం చేయలేకపోతుంది. కోలీవుడ్ సినిమాలతోనే క్షణం ఖాళీ లేకుండా గడుపుతోంది.  ఇక దర్శకుడిగా విఘ్నేష్  కెరీర్ సైతం సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది.