నయన్ వెడ్డింగ్ టీజర్: ఇది పెళ్లి గురించి మాత్రమే కాదు.. అంతకుమించి..!

Sat Sep 24 2022 13:53:28 GMT+0530 (India Standard Time)

Nayanthara Wedding Teaser Netflix

లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇటీవల వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో స్టార్ కపుల్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వెడ్డింగ్ ని ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తోంది.'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. నయన్ మరియు విఘ్నేష్ శివన్ ఒకరినొకరు సోల్ మేట్స్ గా ఎలా కనుగొన్నారు అనే ప్రయాణాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.

తాజాగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' టీజర్ ను నెట్ ఫ్లిక్స్ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ''ఫ్లాష్ లైట్స్ మరియు ఫేమ్ కు మించి నయనతార అనే కల ఉంది. ఇది ఆమె సూపర్ స్టార్ డమ్ కి ఎదుగుతున్న కథను అందిస్తుంది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' త్వరలో రాబోతోంది!'' అని పేర్కొన్నారు.

'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనేది కేవలం నయన్ - విఘ్నేష్ వెడ్డింగ్ గురించి కాదు.. అంతకంటే కంటే ఎక్కువ ఉంటుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. పెళ్లితో పాటుగా వీరి పరిచయం - జ్ఞాపకాలు - వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మరియు అనేక ఇతర విషయాల జర్నీని ఈ డాక్యుమెంటరీ చూపించబోతోంది.

'నయనతారే ఎందుకు?' అని విగ్నేష్ ని ప్రశ్నించగా.. ''ఏంజిలీనా జోలీ కూడా అడిగింది.. కానీ ఆమె సౌత్ ఇండియన్ కాదు.. ఏంటి సార్ ఈ ప్రశ్న'' అంటూ నవ్వుతూ అనడం కనిపిస్తోంది. నయనతార హీరోయిన్ గా కంటే ఒక అద్భుతమైన మనిషి అని తన భార్య గురించి విఘ్నేష్ చెప్పాడు.

నయన్ 'లేడీ సూపర్ స్టార్' గురించి మాట్లాడుతూ.. ట్యాగ్స్ - టైటిల్స్ అనేవి తనకు అర్థం కావని తెలిపింది. తాను ఫిల్మీ కిడ్ ని కాదని.. అందరిలాంటి ఒక సాధారణ అమ్మాయినని చెప్పింది. నయనతార మరియు విఘ్నేష్ శివన్ ఇద్దరూ జీవితంలో కొత్త దశను ప్రారంభించిన నేపథ్యంలో త్వరలోనే ఈ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారువీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్.

ఇదిలా ఉండగా గౌతమ్ మీనన్ ఇటీవల 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ డాక్యుమెంటరీ మీద స్పందించారు. ఇది పెళ్లి సినిమా కాదని.. లేడీ సూపర్ స్టార్ పై డాక్యుమెంటరీ అని స్పష్టం చేశారు. “వారి పెళ్లి సినిమాకి నేను దర్శకత్వం వహిస్తున్నానని మొదట్లో చాలామంది అనుకున్నారు. కానీ అది నెట్ ఫ్లిక్స్ కోసం తీసిన డాక్యుమెంటరీ.. అది నయనతార గురించి చెబుతుంది. ఆమె చిన్ననాటి ప్రయాణం నుండి ఇప్పటి వరకు ప్రతిదీమేము ఇందులో చేర్చాము. చిన్ననాటి ఫోటోలు మరియు ఆమె మధుర క్షణాలను కూడా చూడవచ్చు. అందులో విఘ్నేష్ కూడా భాగమయ్యాడు. మేము ఇంకా దాని కోసం వర్క్ చేస్తున్నాము” అని గౌతమ్ తెలిపారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.